ప్రధాని నివాసం వద్ద గాయపడిన రాహుల్.. ముక్కు నుంచి రక్తం.. అసలేం జరిగింది?

Publish Date:Jul 22, 2026

Advertisement

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ పిలుపు మేరకు మంగళవారం (జులై 21) జరిగిన ప్రధాని నివాసం ముట్టడి కార్యక్రమంలో   రాహుల్ గాంధీతో పాటు పలువురు కీలక నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో  రాహుల్ గాంధీ  గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది.  పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.  దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  

 దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు, కేంద్ర  ప్రభుత్వ అణచివేత చర్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు  ప్రధాని నివాసానికి ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్ నాయకులు,  కార్యకర్తల ర్యాలీని ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.    నిరసనకారులు ముందుకు సాగేందుకు ప్రయత్నించగా, పోలీసులు  లాఠీఛార్జ్ చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. రాహుల్ గాంధీని అక్కడ నుంచి తరలించేందుకు పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఆయన ముక్కు నుంచి రక్తం కారింది.  అయినప్పటికీ భద్రతా సిబ్బంది   ఆయనను నిర్బంధంలోకి తీసుకుని,  మోసుకెళ్లి వ్యాన్ లో ఎక్కించారు. 

ముక్కు నంచి రక్తం కారుతున్నా.. రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా నినాదాలు చేస్తుండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు. యువత కసం నిలబడిన నేత పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు.  ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందనీ..  అలాంటిది ఒక అగ్రనేతపై  పోలీసులు భౌతిక దాడికి దిగడం దారుణమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రజా నాయకుడిగా క్లిష్ట సమయాల్లో భౌతిక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల తరఫున నిలబడిన  రాహుల్ గాంధీ పోరాటపటిమ, నాయకత్వ లక్షణాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  

Rahul Gandhi Bleeding Nose, Rahul Gandhi PM Residence Protest, Congress Delhi Protest, Rahul Gandhi Detained Delhi Police, Rahul Gandhi Injury

By
en-us Political News

  
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.