దర్శకేంద్రుడి పుట్టినరోజు
Publish Date:May 23, 2013
Advertisement
తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులు అద్దిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు.. భక్తి, రక్తి, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా ఆయన తెలుగు తెరమీద ఆవిష్కరించని సినిమానే లేదు.. ఎంత సాదించినా ఎంతటి అత్యున్నత శిఖరాలను అధిరోహించినా ఎప్పుడూ మౌన ముద్రలోనే కనిపించే సినీ ముని ఆయన.. ఆయనే కె.రాఘవేంద్రరావు BA.. ఆయన జన్మదినం సందర్భంగా ఆ దర్శకేంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆనాటి ఎన్టీఆర్ నుండి ఈ నాటి ఎన్టీఆర్ వరకు.. సూపర్‌స్టార్ కృష్ణ నుంచి మహేష్‌బాబు వరకు, దాదాపు మూడు తరాల హీరొలతో అత్యద్భుతమైన హిట్స్ అందించిన సినీ సృష్టికర్త ఆయన.. అందుకే ఆయన మూసగా సాగిపోతున్న తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులతో కలర్‌ఫుల్ టచ్ ఇచ్చాడు.. ఎంతో మంది హీరోలకు స్టార్‌డమ్‌ను అందిచిన దర్శకుడు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, శోభన్‌బాబు లాంటి హీరోలకు ఆయన దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్స్ లభించాయి.. ప్రపంచంలో శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన అతి కొద్ది మంది దర్శకుల్లో దర్శకేంద్రుడు ఒకరు.. తెలుగు తెరకి గ్లామర్‌ని తీసుకొచ్చిన దర్శకుడు కూడా ఆయనే, హీరోయిన్లను అందంగా చూపించడంలోను, స్క్రీన్‌ను అందమైన కాన్వాస్‌లా మలచడంలోనూ, కే. రాఘవేంద్రరావు ని మించిన దర్శకులు తెలుగు లో లేరంటే అతి శయోక్తి కాదు. అందుకే అప్పుడు ఇప్పుడు హీరోయిన్లు రాఘవేంద్రారవుగారి దర్శకత్వంలో ఒక్కసినిమా అయినా చేస్తే చాలు అనుకుంటారు.. ప్రేమ్ నగర్ వంటి అద్భుతమైన ప్రేమకథలను అందించిన ప్రకాశ్ రావు కుమారుడే మన కోవెలముడి రాఘవేంద్రరావు, ఈయన 1942 మే 23 న జన్మించారు. తండ్రితో పాటు విక్టరి మదుసూదన్‌గారి దగ్గర శిష్యరికం చేసిన రాఘవేంద్రరావు.. 1975 లో వచ్చిన బాబు సినిమాతో డైరెక్టర్‌గా మారారు.. కెరీర్ స్టార్టింగ్‌లో ఆఫ్ బీట్ సినిమాలు మాత్రమే తీసిన రాఘవేంద్రడు తరువాత తరువాత కమర్షియల్ పంథాకు మారాడు.. ముఖ్యంగా 1977లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన అడవిరాముడు సినిమాతో పూర్తి స్థాయి కమర్షియల్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు.. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన వేటగాడు, డ్రైవర్‌రాముడు, గజదొంగ, కొంటవీటి సింహం లాంటి సినిమాలు వరుస హిట్స్‌గా నిలిచాయి.. సూపర్ స్టార్ కృష్ణ ని సరికొత్త కోణంలో చూపించిన దర్శకుడు కూడా రాఘవేంద్ర రావే. వీరి కాంబినేషన్లో వచ్చిన అగ్ని పర్వతం సూపర్ స్టార్ పాపులారిటీని రెట్టింపు చేసింది. యన్.టి.ఆర్ తర్వత ఎక్కువగా కృష్ణ తోనే సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసారు రాఘవేంద్రరావు. మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్రరావుల కాంభినేషన్‌లో భారీ హిట్స్ వచ్చాయి..అడవిదొంగ, ఘరానమొగుడు, రౌడి అల్లుడు, ఇద్దరు మిత్రులు లాంటి హిట్ చిత్రాలతో పాటు జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి మాస్టార్ పీస్ కూడీ వీరి కాంభినేషన్‌లో రూపొందిందే.. అంతేకాదు అతి ఎక్కువ మంది వారసులను టాలీవుడ్‌కు పరిచయం చేసింది కూడా రాఘవేంద్రరావే.. విక్టరీ వెంకటేష్, మహేష్‌బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్లను వెండితెరకు అందిచిన ఘనత కూడా రాఘవేంద్రునిదే.. కమర్షియల్ సినిమాలతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నా ఆయన ఆ సినిమాలతోనే ఆగిపోవాలనుకోలేదు.. అందుకే భక్తి రసాన్ని కూడా వెండితెర మీద పారించాడు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి లాంటి సినిమాలో రాఘవేంద్రరావు, నాగార్జునల కెరీర్‌లోనే కాదు టాలీవుడ్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి.. హింది ప్రేక్షకులకు కూడా రాఘవేంద్ర రావు సుపరిచితమే. తెలుగులో ఆయన తీసిన చాలా సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఆయనే స్వయంగా హిమ్మత్ వాలా వంటి బ్ల్లక్ బాస్టర్‌ను హింది చిత్రసీమకు అందించారు. ఈ సినిమాతో శ్రీదేవి హిందీలో స్టార్ హీరోయిన్‌గా మారింది. తెలుగు తెరకు భక్తి, రక్తి రసాలను సమాపాల్లలో అందిస్తున్న దర్శకేంద్రుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరిన్ని హిట్ చిత్రాలతో మనల్ని అలరించాలని కోరుకుంటూ రాఘవేంద్రరావుగారికి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు..
http://www.teluguone.com/news/content/raghavendra-rao-birthday-32-23157.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





