ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై వెల్లువెత్తుతున్న నిరసనలు

Publish Date:Sep 21, 2022

Advertisement

తాటిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడగట్టి కోసం అన్నడట అన్నది సామెత అలాగే ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుకు కారణమేమిటంటే జగన్ ఎన్టీఆర్ డాక్టర్ కాదు కనుక ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పడం. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో జగన్ పాపాల లెక్క పరిమితి దాటేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలలో ఆగ్రహాన్ని నింపాయనీ.. అయితే ఎన్టీఆర్ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం ప్రజలలో ఆయన పట్ల ఏహ్య భావాన్ని కలిగించిందని అంటున్నారు.

విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఇదే పంథా అనుసరించి ఉంటే..  జగన్ పాదయాత్ర చేయగలిగే వారా? వైఎస్ పేరు ఏపీలో ఎక్కడైనా కనిపించనిచ్చే వారా? అని జనం ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై ప్రజలలో ఆగ్రహం, జగన్ సర్కార్ పట్ల వ్యతిరేకత పెల్లుబుకుతోంది.     ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ నుంచి కొనసాగుతున్న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చేందుకు బుధవారం (సెప్టెంబర్ 21)న అసెంబ్లీ ఆమోదం తెలపడం రాష్ట్రంలో రాజకీయ రచ్చ రేపింది. ఎన్టీఆర్‌ హెల్త్‌  ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి  డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి హెల్త్‌ యూనివర్సిటీగా పేరు  మార్చే నిర్ణయంపై ఈ నిర్ణయంపై తెలుగు దేశం సహా అన్ని రాజకీయ పార్టీలు, అన్న విర్గాల ప్రజలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆఖరికి వల్లభనేని వంశీ లాంటి జగన్ భక్తులు కూడా ఈ విషయంలో పునరాలోచించాలని సీఎంను కోరారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి  డాక్టర్‌ ఉంది ఎన్టీఆర్‌  డాక్టర్‌ కాదు. అందుకే పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నానని జగన్ చెబుతున్నారు. అలాగూ వైద్యాన్ని పేదలకు చేరువ చేసిన  ఆరోగ్యశ్రీ పథకం వైఎస్ ప్రవేశపెట్టారనీ    ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత వైఎస్ దేననీ అందుకే పేరు మార్చాననీ అంటున్నారు. అయితే పేరు మార్పు నిర్ణయంపై జగన్ ఇచ్చిన వివరణ, చేసుకున్న సమర్థన ఎవరూ అంగీకరించడం లేదు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై ఏపీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ నిరసన వ్యక్తమౌతోంది. వైఎస్ తనయుడిగా తన తండ్రి పేరును సంస్థలకు పెట్టాలంటే.. తాను స్థాపించన సంస్థలకు పెట్టు కోవాలనీ.. అంతే కానీ ఎవరో కట్టిన ఇంటిని కబ్జా చేసినట్లు మహానుభావుల పేర్లను మార్చేయడం ఎంత మాత్రం సబబు కాదనీ అంటున్నారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్కటంటే ఒక్క సంస్థను స్థాపించిన పాపాన పోలేదనీ, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో జగన్ తన పతనానికి తానే బాట వేసుకున్నట్లుందని విమర్శకులు అంటున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.