రాంపుర చారిత్రక అన్నవాళ్లను కాపాడుకోవాలి

Publish Date:Sep 19, 2024

Advertisement

పురావస్తు పరిశోధకులు డా.ఈమని శివనాగిరెడ్డి 

కర్ణాటక లోని  శ్రీరంగపట్నం తాలూకా, రాంపురలోని విజయనగర కాలం నాటి చారిత్రక ఆనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా  సీఈఓ  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. రాంపుర గ్రామానికి చెందిన దేవత కృష్ణప్రసాద్ ఆహ్వానంపై  ప్రముఖ వారసత్వ పరిరక్షణ ఆర్కిటెక్ట్ బోయపాటి శరత్ చంద్రతో  కలిసి శుక్రవారం నాడు ఆయన రాంపూర  చారిత్రక ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పచ్చటి పొలాల మధ్య సుందరతర కావేరి తీరంలో సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన రాంపూర లోని పురాతన దేవాలయాలను కాపాడుతున్న కృష్ణ ప్రసాద్ వాటి వివరాలను అందించారన్నారు.

 కావేరీ తీరంలోని సుప్రసిద్ధ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం సమీప గ్రామమైన రాంపుర లో క్రీ.శ. 16వ శతాబ్దికి చెందిన మూడు వీరగల్లులు, ఒక సతికల్లు, 9 అడుగుల ఎత్తున్న వీరాంజనేయ, బాలాంజనేయ విగ్రహాలు, కావేరీ నదిలో బండరాళ్లకు చెక్కిన సిద్ధి వినాయక శిల్పం, శివలింగం, ఎదురుగా ప్రతిష్టించిన నంది విగ్రహం, విజయనగర కాలంలో గ్రామం ప్రముఖ స్థావరంగా వెలుగొందిందని తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు.

కావేరి నదిలోను, ఒడ్డున, ఆలయ నిర్మాణానికి, శిల్పాలు చెక్కడానికి కావలసిన రాతిని తీసిన క్వారీలను, రాతిని విడగొట్టడానికి గూటాలు దింపటానికి చెక్కిన ఆనవాళ్లను శివనాగిరెడ్డి గుర్తించారు. ఇంకా రామాయణ కాలపు గౌతమ మహర్షి నివాస స్థావరం, స్నాన ఘట్టాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, శ్రీరంగపట్నం పర్యాటకులను రాంపూర కు రప్పించవచ్చని ఆయన అన్నారు. ఇప్పటికి చెక్కుచెదరని వందేళ్ల నాటి ఇళ్లకు కొద్దిపాటి మరమ్మతులు చేసి, ఆతిథ్య రంగంలో స్థానికులకు శిక్షణ ఇచ్చి, పెయింగ్ గెస్ట్ ఎకామిడేషన్ సౌకర్యం కల్పించి, రాంపురను, వారసత్వ, తీర్థయాత్ర, గ్రామీణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని శరత్చంద్ర అన్నారు.

By
en-us Political News

  
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.