Publish Date:Feb 27, 2012
ప్రొద్దుటూరు: మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు త్వరలో జరగుతున్నయనే సూచనలు వస్తున్న తరుణంలో కడపజిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు పెరుగుతుండటం ఆ పార్టీని కలవరపెడుతుంది.తాజాగా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ చార్జి మధ్య పదవుల చిచ్చు రగిలింది. ప్రొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బషీర్ అహ్మద్ పేరును ప్రతిపాదించానని, ఆయనే అధ్యక్షుడిగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రకటించారు. దీనికి నియోజకవర్గ ఇన్ చార్జి ముక్తియార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమతో ఏమాత్రం సంప్రదించకుండానే బషీర్ అహ్మద్ పేరును ఏకపక్షంగా ప్రకటించారంటూ ఆయన వరదరాజులురెడ్డిపై పిసిసి, డిసిసికి ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురి మధ్య ఉన్న విభేదాలు బైటపడ్డాయి.
వరదరాజులురెడ్డి జగన్ వర్గంలోకి వెళ్ళిన సందర్భంలో ఆయన అనుచరుడైన ముక్తియార్ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అతనికి నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు ఇస్తామని అమాత్యులు, పిసిసి హామీ ఇవ్వడంతో ముక్తియార్ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఇది వరదరాజులు రెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. వరదరాజులురెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటినుంచి ముక్తియార్ కు చెక్ పెడుతూ వచ్చారు. దీనిలో భాగంగానే మైనార్టీ వర్గానికి చెందిన మరో నాయకుడు బషీర్ అహ్మద్ ను ప్రొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ప్రకటించారు. ఈ ప్రకటన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చును రగిల్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prodduturu-24-12228.html
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది