కాంగ్రెస్ అధినేత్రిగా ప్రియాంక?

Publish Date:Aug 21, 2022

Advertisement

కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. త్వరలోనే నామినేషన్ల ప్రక్రియకు ఆ పార్టీ శ్రీకారం చుట్టనుంది. ఇదంతా ప్రతి పార్టీలోనూ మామూలుగా జరిగే వ్యవహారమే. కానీ కాంగ్రెస్ పార్టీ విషయం మాత్రం ప్రత్యేకం. పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటుండటం, ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు మోస్తున్న సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం.. గాంధీ కుటుంబం వినా మరో వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ సిద్ధంగా లేకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నిక గడువు సమీపిస్తున్న సమయంలో కూడా పార్టీ చీఫ్ విషయంలో ఎటువంటి పురోగతీ కనిపించడం లేదు.

2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ పార్టీ నుంచి ఎంతగా ఒత్తిడి వచ్చినా రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. అనివార్య పరిస్థితిలో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇక ఆ బాధ్యతలు తాను చేపట్టలేనని సోనియా కూడా తేల్చేశారు. దీంతో పార్ట అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారన్న విషయంలో పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ప్రియాంకు ఒప్పించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందని పరిశీలకులు అంటున్నారు. ఎందు కంటే గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయట నుంచి ఎవరైనా పార్టీ పగ్గాలు చేపడితే.. పార్టీని ఐక్యంగా ఉంచడం సాధ్యం కాదని పార్టీలో మెజారిటీ నాయకులు భావిస్తున్నారు.

 అందుకే పార్టీ మొత్తం ఇప్పుడు ప్రియాంక వైపు చూస్తున్నది. ఆమెలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయని చెబుతుంటారు. ప్రియాంక గాంధీ కూడా ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రత్యక్ష ఆందోళనల్లో సైతం పాలు పంచుకుంటున్నారు. దీంతో ఆమెకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. అయితే ఇటీవలి యూపీ ఎన్నికలలో వైఫల్యం ఆమెకు ప్రతిబంధకంగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఆగస్టు 21(ఆదివరం) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 28 నామినేషన్ల దాఖలుకు తుది గడువు. 

ఆగస్టు 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఆగస్టు 28.  అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనా ఇప్పటికీ అధ్యక్ష పదవికి నామినేషన్ల వ్యవహారంలో పార్టీ ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదు. ఇంకా అధ్యక్ష పగ్గాలు చేపట్టాల్సిందిగా పార్టీ సీనియర్లు రాహుల్ గాంధీని ఒప్పించేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.  అలాగే ఆయన పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల విషయంలో కూడా అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు.

బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమి ఏర్పాటులో కూడా ఆయన జోక్యం ఇసుమంతైనా లేదు.  ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్లు ప్రియాంక వైపు చూస్తున్నారు.పార్టీలో నాయకత్వ సంక్షోభానికి తెరపడాలంటే పార్టీ పగ్గాలు అందుకోవడానికి రాహుల్ గాంధీ అయినా అంగీకరించాలి.. లేదా ప్రియాంక గాంధీ అయినా ముందుకు రావాలని పార్టీ సీనియర్లు అంటున్నారు. ఒక వేళ అనివార్యంగా గాంధీ కుటుంబానికి చెందని వారెవరైనా పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వస్తే ఆ వ్యక్తి ఎవరన్న దానిపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు ఏ మాత్రం లేవు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.