ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (మే 10) తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా మిత్రపక్షాల నేతలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నారు. ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ హైదరాబాద్ పర్యటనకు రావడం ఇదే మొదటి సారి. ఈ పర్యటనలో భాగంగా ఆయన సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అది పక్కన పెడితే.. సాధారణంగా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సారి ప్రోటోకాల్‌కు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లనున్నారు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆ తరువాత ప్రధాని మోడీ చంద్రబాబు నివాసం నుంచి నేరుగా మాదాపూర్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెడతారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను ఆయన పరామర్శిస్తారు. ప్రధాని ఒకే రోజు ఇద్దరు కీలక మిత్రపక్ష నేతల ఇళ్లకు ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prime-minister-modi-visits-chandrababu-and-pawan-residences-25-219351.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.