సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన ప్రధాని మోడీ

Publish Date:Apr 15, 2025

Advertisement

పధ్నాలుగేళ్ల కిందట ఓ వ్యక్తి ఓ ప్రతిజ్ణ చేశారు. అప్పటికి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోడీ దేశానికి ప్రధాని అవ్వాలనీ, ఆయనను తాను స్వయంగా కలవాలనీ, అంత వరకూ పాదరక్షలు ధరించబోననీ ప్రతిన పూనారు. అప్పటి నుంచీ ఆ వ్యక్తి పాదరక్షలు ధరించడం మానేశారు. 2014 ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానిగా నరేంద్రమోడీ పదవీ పగ్గాలు చేపట్లారు. అయినా ఆ వ్యక్తి ప్రధానిని కలవడం కుదరలేదు. దీంతో పాదరక్షలు ధరించబోనన్న తన ప్రతిజ్ణను కొనసాగించారు. 2019లో మరో సారి ఎన్డీయే కూటమి విజయం సాధించింది. నరేంద్రమోడీ దేశ ప్రధానిగా రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టారు. అయినా ఆ వ్యక్తి తన దీక్షను కొనసాగించారు. 2024 ఎన్నికలలో కూడా ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ముచ్చటగా మూడో సారి మోడీ ప్రధాని అయ్యారు. మూడో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పది నెలల తరువాత మోడీ ఆ వ్యక్తిని కలిశారు. దీక్షను విరమింప చేశారు. 

అసలు విషయం ఏమిటంటే.. 14 ఏళ్ల కిందట హర్యానాకు చెందిన రాంపాల్ కస్యప్ అనే వ్యక్తి ప్రధాని మోడీపై అభిమానంతో ఆయన ప్రధాని అయ్యే వరకూ, ఆయనను తాను కలిసే వరకూ  పాదరక్షలు ధరించేది లేదని శపథం చేశారు. పాదరక్షలు ధరించబోనన్న దీక్షను గత 14 ఏళ్లుగా కొనసాగిస్తూనే వచ్చారు. చివరకు ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ రాం కాశ్యప్ ను యమునాగర్ లో స్వయంగా కలిశారు. ఇటువంటి ప్రతిజ్ణలు చేయవద్దనీ, ప్రజా సేవపై దృష్టి పెట్టమనీ హితవు చెప్పారు. అంతే కాకుండా స్వయంగా రాం కాశ్యప్ కు పాదరక్షలు తొడిగి దీక్ష విరమింప చేశారు.  ఆ సందర్భంగా రాంపాల్ కశ్యప్ తో మోడీ కొద్ది సేపు మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్ వేదకగా ప్రజలతో పంచుకున్నారు. 

హర్యానాలోని కైథాల్ నివాసి అయిన రాంపాల్ కశ్యప్‌తో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, "నేను ఇప్పుడు మీకు పాదరక్షలు తొడుగుతున్నాను, కానీ భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయవద్దు. మీరు పని చేసుకోవాలి, ఇలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు?" అని సూచించారు. ప్రధానిని కలవడం పట్ల రాంపాల్ కశ్యప్ ఆనందం వ్యక్తం చేశారు.

 ఈరోజు యమునానగర్ బహిరంగ సభలో కైథాల్‌కు చెందిన శ్రీ రాంపాల్ కశ్యప్‌ను కలిశాను. నేను ప్రధాని అయ్యాక, నన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. రాంపాల్ వంటి వారి పట్ల నేను వినమ్రుడను, వారి అభిమానాన్ని స్వీకరిస్తాను. కానీ ఇలాంటి ప్రతిజ్ఞలు చేసే వారందరినీ కోరుతున్నాను - మీ ప్రేమను  గౌరవిస్తాను... దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టి పెట్టండి!" అని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  రాంపాల్ కశ్యప్ కు తాను పదరక్షలు తొడుగుతున్న వీడియోను ఆ పోస్టకు జత చేశారు.  

By
en-us Political News

  
తినేమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (ఏప్రిల్ 28) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ లోనే అనుమతిస్తున్నారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక సెక్రటరీ స్మితా సభర్వాల్‌ను ఫైనాన్స్ క‌మిష‌న్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీగా స్మితా స‌బ‌ర్వాల్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అవసరమైతే డైరీల్లో రాసుకోండి అని సూచించారు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని.. నేను కూడా రేపటినుంచి బయల్దేరుతా ఒక్కొక్కరి సంగతి చూస్తా అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో వారు భేటీ అయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ లు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులపై కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ను వారు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు వినతి పత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ నేతలు.
తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ శాంతి కుమారి ఈ నెల 30 పదవీవిరమణ చేయనున్నారు. 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రామకృష్ణారావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, పర్యటన రోడ్ మ్యాప్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌ఫోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులకు బదులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాశారు. రేపు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల.. విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు సూపర్ స్టార్ బదులిచ్చారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇందులో కొంత మొత్తం చెక్కుల రూపంలో, మరికొంత నగదు రూపంలో అందుకున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సభకు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో ఓఆర్ఆర్‌పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని.. క్రియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన వెహికల్స్ భారీగా వచ్చాయి.
బీఆర్ఎస్ రజతోత్సవ సభపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక రాజకీయ పార్టీ ఒక మాదిరి సభ పెట్టాలంటే ఖర్చులు భరించలేక నాయకుల నరాలు తెగుతాయ్. రూపాయి రూపాయి పోగేసి సభను సక్సెస్ చేస్తే చాలు… అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. అందులోనూ ప్రతిపక్షంలో ఉండి సభ నిర్వహించాలంటే ఎంత నరకమో చెప్పనక్కర్లేదని ఎంపీ చామల ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
. ప్రతి భారతీయుడూ ఈ దాడి పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్నారని దాడికి పాల్పడిన ఏ ఉగ్రవాదినీ వదిలేది లేదని హెచ్చరించారు. ఉగ్రవాదం అంతానికి కంకణం కట్టుకున్నట్లు ఉద్ఘాటించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరువాడా సిద్ధమైంది. పోరాటాల గడ్డ ఓరుగల్లుకు తెలంగాణ రాష్ట్ర నుంచి నలుదిక్కులా ప్రజలు తమ ఇంటి పండుగలా భావించి వెల్లువలా కదిలివస్తున్నారు. ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో గులాబీ పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అలాగే పార్టీ ఏర్పాటైన జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మరోవైపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై గౌరవం, ఇంటిపార్టీపై అభిమానంతో రైతులు, సాధారణ ప్రజలు ఎందరో ఎల్కతుర్తిలో జరగనున్న సభకు ముందుగానే బయలుదేరారు. సూర్యాపేటకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఎండ్లబండ్లపై ఎల్కతుర్తికి వెళ్తున్నారు. సిద్దిపేటకు చెందిన యువకులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.
గత ప్రభుత్వం హయాంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండాలని కుట్ర పన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందనేది సీఐడీ ఆరోపణ. ఇది నిజం అనేలా పలు రకాల ఆధారాలు సైతం సేకరించింది. ఇందులో పాత్ర ఉందని అనుమానాలు ఉన్న వారికి సంబంధించిన సీడీఆర్ ఫైల్స్ ను సంపాదించిన సిట్ యాక్షన్ లోకి దిగింది. తొలుత సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అయినా , అర్థరాత్రి వరకు పనిచేసిన ఉద్యోగి గౌతమ్ తేజ్ ను అరెస్టు చేశారు. అక్కడే పని చేస్తున్న మాజీ ఆర్డీవో, ఆర్డీవో ఇతర అధికారుల పై సైతం చర్యలు తీసుకున్నారు.
ఉగ్ర‌దాడికి భార‌త్ గ‌ట్టి బ‌దులే ఇస్తుంది. అది మ‌రెవ్వ‌రూ ఊహించ‌న‌దిగా ఉంటుంది. ఇదీ మోడీ ప‌హెల్గామ్ అటాక్ త‌ర్వాత చేసిన కామెంట్. మోడీ ఇంత సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డం ఇదే మొద‌టి సారి. అయితే ఇప్ప‌టికే సింధూ జ‌లాల ఒప్పందం ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు ప్ర‌ధాని మోడీ. యుద్ధం చేయ‌డం కంటే నీళ్లు ఆప‌డం అతి పెద్ద యుద్ధం. దీని సాధ్యాసాధ్యాలు వ‌చ్చే రోజుల్లోగానీ తెలీదు. అలాగ‌ని ఇదే చాల‌నుకున్నా క‌ష్ట‌మే. ఎందుకంటే ఇందుకు కావ‌ల్సినంత టైం తీస్కుంటుంది. ఈలోగా ఇలాంటి ఎన్నో ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం కూడా ఉంది. దానికి తోడు ఇదే అంశంపై ల‌ష్క‌రే తోయిబా చీఫ్ హ‌ఫీజ్ స‌యిద్ మీరు మా నీరు ఆపితే మేము మీ శ్వాస ఆపేస్తామ‌ని.. ఈ స‌రికే ప్ర‌క‌టించి ఉన్నాడు.. రీసెంట్ గా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావ‌ర్ భుట్టో సైతం స‌రిగ్గా ఇలాంటి లాంగ్వేజీనే వాడి భార‌త్ ను హెచ్చ‌రించాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.