Publish Date:Mar 26, 2025
హైద్రాబాద్ సరూర్ నగర్ కు చెందిన అప్సర అనే యువతిని 2023 జూన్ 3న హత్య చేసిన పూజారీ సాయికృష్ణకు రంగా రెడ్డి కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ప్రతీ రోజు అప్సర అనే యువతి ఆలయానికి వచ్చేది. ఈ నేపథ్యంలో పూజారీతో పరిచయం ప్రేమకు దారితీసింది. పూజారి సాయి కృష్ణకు అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నారు. అప్సరకు కూడా అ ప్పటికే పెళ్లయి భర్తతో విడిపోయింది. సినిమాల్లో నటించాలన్న కోరికతో అప్సర తమిళనాడు నుంచి హైద్రాబాద్ చేరుకుంది. అప్సరతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఓకే చెప్పిన పూజారి పెళ్లి చేసుకోవడానికి మాత్రం నిరాకరించాడు. ప్రతీరోజు అప్సర పూజారి సాయికృష్ణ ను పెళ్లి చేసుకోవాలని వేధించేది. ఎలాగో అలా అప్సరను వదిలించుకోవాలనుకున్న పూజారీ పథకం ప్రకారం తమిళనాడు కోయంబత్తూరు తీసుకెళతానని మాయమాటలు చెప్పాడు. తన కారులోనే శంషాబాద్ మండలంలోని సుల్తాన్ పల్లిలోని ఓ గో శాలకు తీసుకెళ్లాడు. సిసి కెమెరాలు లేవని నిర్ధారించుకుని అప్సరను హత్య చేశాడు. ముఖంపై ప్లాస్టిక్ కవర్ తో కప్పి అత్యంత పాశవికంగా పూజారి అప్సరను హత్య చేశాడు. తాను చేసిన నేరాన్ని పూజారి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. బలమైన సాక్ష్యాలతో పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేశారు. రంగా రెడ్డి కోర్టులో ట్రయల్ ముగియడంతో బుధవారం తీర్పు వెలువడింది. పూజారికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/priest-sai-krishna-gets-life-imprisonment-in-apsara-murder-case-25-195042.html
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.