మునుగోడులో మూడు పార్టీల్లో ముందున్నదెవరో?

Publish Date:Oct 3, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నిక నగారా మోగింది. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నెల 14 వరకూ నామినేషన్ల దాఖలకు గడువు ఉంది. మునుగోడుతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్,, ఒడిశా ల్లోని ఒక్కో నియోజకవర్గానికి, బీహార్‌ లో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక, అధికార తెరాస మాత్రమే కాదు, కాంగ్రెస్, బీజేపీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకాగా తీసుకున్నాయి.

ఒక విధంగా, 2023 అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ కానుందని, పరిశీలకులు ప్రజలు భావిస్తున్నారు. అలాగే, మునుగోడు ఉప ఎన్నిక అధికార తెరాస ఎనిమిదేళ్ళ పాలనకు రెఫరెండం, అయితే, బీజేపీ తెలంగాణలో కాషాయ జెండా ఎంట్రీకి గేట్’వే (ముఖ ద్వారం)గా భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టికుని సత్తాచాటేందుకు చూస్తోంది. ముఖ్యంగా, సిట్టింగ్ స్థానం, హుజూర్’ నగర్  సహా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉపన్నికల్లోనూ ఓటమిని ఎదుర్కున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి అయినా, మరో సిట్టింగ్ స్థానం మునుగోడును ఎలాగైనా నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.

బీజేపీలో చేరిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక జరుగతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో  రాజగోపాల రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు. అధికారికంగా, బీజేపే అధిష్టానం ఇంకా ఆయన పేరు ప్రకటించక పోయినా, పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు ఇప్పటికే అయన తరపున పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు.

మరోవంక, కాంగ్రెస్ పార్టీ పాల్వాయ్ స్రవంతిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి, ముమ్మరంగా ప్రచ్రాం సాగిస్తోంది. అయితే అధికార తెరాస మాత్రం ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. కానీ, జిల్లా మంత్రి జగీష్ రెడ్డి సారధ్యంలో కేసీఆర్’ బొమ్మతో ప్రచారం సాగిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతొ విందులు, వినోదాలతో పెద్ద ఎత్తున ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు నియోజక వర్గంలో ఇంకా ఎంతో కొంత పట్టున్న వామపక్ష పార్టీలు తెరాసకు మద్దతు ప్రకటించాయి. అయితే  మునుగోడు, ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపధ్యంలో, ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.