తమిళనాట దళపతి విజయ్ పాదయాత్ర.. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు

Publish Date:Feb 11, 2025

Advertisement

తమిళనాడు రాజకీయాలలోకి ప్రముఖ హీరో తళపతి విజయ్ ప్రవేశమే ఒక సంచలనం అనుకుంటే.. ఆయన తన పార్టీ తమిళగ వెట్రిక కజగం (టీవీకే)కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకోవడం మరింత సంచలనం సృష్టించింది. దేశంలో పలు పార్టీలను విజయతీరాలకు చేర్చేలా వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిశోర్ గత కొంత కాలంగా ఎన్నికల వ్యూహకర్త కొలువు మానేసి బీహార్ లో సొంత పార్టీ పెట్టుకుని పూర్తిగా ఆ రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైపోయారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఎన్నికల వ్యూహకర్త అవతారం ఎత్తారు. తమిళనాట కొత్తగా రాజకీయ ప్రవేశం చేసిన హీరో విజయ్ పార్టీ టీవీకేకి ప్రత్యేక సలహాదారుగా ఎన్నికల వ్యూహాలు రచించనున్నారు. 

ప్రశాంత్ కిశోర్ మామూలు వ్యక్తి కాదు. కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు అందుకోవడంలో పీకే వ్యూహాలు ఉన్నాయి. అలాగే 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనే కారణమనడంలో సందేహం లేదు. ఇక 2021 ఎన్నికలలో తమిళనాడులో డీఎంకే విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టం వెనుకా ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచన ఉంది. అంతెందుకు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వరుసగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టడం వెనుక ఉన్నదీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే. అటువంటి ప్రశాంత్ కిశోర్ ఇటీవల పార్టీలకు ఎన్నికల వ్యూహాల రూపకల్పనకు గుడ్ బై చెప్పేసి తన స్వరాష్ట్రం బీహార్ లో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీహార్ లో అధికారమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పని చేసుకుంటున్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రాష్ట్ర సమస్యలపై ఆందోళనా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇటీవలే రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష కూడా చేశారు. 

ఇక తమిళనాట సినీ హీరోగా విపరీతమైన ప్రేక్షకాదరణ ఉన్న విజయ్ సినీమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీవీకే పేర సొంత పార్టీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి రాజకీయాలలోకి దిగారు.ప్రస్తుతం చేతిలో ఉన్న ఒకే ఒక సినీమాను పూర్తి చేసి ఈ ఏడాది మలి భాగంలో పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితం కానున్నట్లు విజయ్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి ఇప్పటి నుంచే ప్రయత్నాలూ ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. అందులో బాగంగానే టీవీకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నారు.  రాష్ట్రంలో టీవీకే బలోపేతం, ఎన్నికల వ్యూహాల రూపకల్పన,  పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడం వంటి అంశాలలో విజయ్ కు ఆయన పార్టీ టీవీకేకు ప్రశాంత్ కిశోర్ తోడ్పాటు, సహకారం అందిస్తారు. ఈ మేరకు ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ తో సంప్రదింపులు పూర్తయ్యాయని చెబుతున్నారు.   ఇక అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు.

దళపతి రాజకీయ ప్రస్థానం ఘనంగా ఉండేలా ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా రానున్న రోజులలో విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేపట్టేలా ప్రశాంత్ కిశోర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైందని అంటున్నారు.  

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.