Publish Date:Aug 17, 2026
ఎన్నికల వ్యూహకర్తగా పలువురు రాజకీయ పార్టీలను ఎన్నికలలో గెలిపించి కింగ్ మేకర్ గా గుర్తింపు పొందిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు స్వయంగా ప్రజాప్రతినిధిగా చట్టసభలో అడుగుపెట్టారు. తన సరికొత్త రాజకీయ ప్రయాణంలో భాగంగా ఆయన బంకిపుర్ శాసనసభ నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా బీహార్ అసెంబ్లీలో సోమవారం (ఆగస్టు 17) ప్రమాణ స్వీకారం చేశారు.
బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ తన ఛాంబర్‌లోనే ప్రశాంత్ కిషోర్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. జన సురాజ్ పార్టీని స్థాపించి, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి చైతన్యం తెచ్చిన పీకే.. ఇప్పుడు అధికారికంగా శాసనసభా కార్యకలాపాల్లో పాల్గొనే అర్హతను సాధించారు.
అసెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిశోర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జన సురాజ్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
Prashant Kishor, Prashant Kishor MLA Oath, Bankipur Assembly By Election, Jan Suraaj Party, Bihar Politics
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prashant-kishor-25-229083.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.