ఆంధ్రప్రదేశ్ ను వెనక్కినెట్టిన తెలంగాణ.. సింగిల్ డేలో పవర్ ఫుల్ రికార్డు...

Publish Date:Feb 29, 2020

Advertisement

తెలంగాణ విద్యుత్ శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉమ్మడి ఏపీలో కూడా సాధ్యంకాని రికార్డును తెలంగాణ రాష్ట్రం సాధించింది. తెలంగాణలో ఒక్కరోజే 13వేల 168 మెగావాట్ల అత్యధిక వినియోగం జరిగింది. ఇంత పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడినా, ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సంస్థలు పవర్‌ సప్లై చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. 23 జిల్లాల ఉమ్మడి ఏపీ చరిత్రలో 2014 మార్చి 23న అత్యధికంగా 13వేల 132 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంతకు మించిన వినియోగంతో 2020 ఫిబ్రవరి 20న రికార్డు నెలకొల్పింది.

2014లో తెలంగాణ రాష్ట్రం మొత్తం 47వేల 338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా, 2018-19లో అది 68వేల 147 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే, ఆరేళ్లలో దాదాపు 44శాతం వినియోగం పెరిగింది. అదే సమయంలో దేశ సగటు మాత్రం 23శాతంగా మాత్రమే నమోదైంది. ప్రపంచంలో ప్రగతి సూచికలుగా గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం... దేశ సగటునే మించిపోయింది. దేశవ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 11వందల 81 మెగావాట్లు కాగా, తెలంగాణలో మాత్రం 18వందల 96 మెగావాట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం 13వందల 56 మెవావాట్లుంటే.... అది ఆరేళ్లలో 39.82శాతం పెరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాలతో విద్యుత్ వినియోగం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఇక, 2018 జనవరి 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంపు సెట్లకు 24గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి, రాష్ట్రంలో 19లక్షలకు పైగా పంపు సెట్లు ఉంటే, ఇప్పుడు 24లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. ఇక, 2014లో ఎత్తిపోతల పథకాలకు కేవలం 680 మెగావాట్ల డిమాండ్ ఉండగా, అదిప్పుడు 2వేల200 మెగావాట్లకు పెరిగింది. అయితే, ప్రభుత్వం చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కారణంగా ఇది మరింత పెరిగే అవకాశముంది.

ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుముందు, పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ప్రకటించే పరిస్థితి ఉండగా, ఇప్పుడు, 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. పట్టణీకరణ, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధితో వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు భారీగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి కోటీ 11లక్షలకు పైగా వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇప్పుడది కోటీ 54లక్షలు దాటింది. అంటే, విద్యుత్ కనెక్షన్లలో 38.61శాతం వృద్ధి నమోదైంది. ఇక, తెలంగాణ ఏర్పడే నాటికి 233 సబ్ స్టేషన్లుంటే, అవిప్పుడు 347కి చేరాయి. ఇక, తెలంగాణ రాష్ట్రం వచ్చేనాటికి స్టేట్‌లో 7వేల 78 మెగావాట్ల స్థాపిత విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడది 16వేల 246 మెగావాట్లకు చేరిందని, అలాగే, అప్పుడు 74 మెగావాట్ల సోలార్ పవర్ మాత్రమే అందుబాటులో ఉంటే, ఇప్పుడు 3వేల 650 మెగావాట్లకు పెరిగిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగం... ఇప్పుడు ఇంత గొప్పగా రూపాంతరం చెందడానికి ఒక్కరోజులో జరిగిన అద్భుతం కాదని, దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, అనుక్షణ పర్యవేక్షణ, విద్యుత్ ఉద్యోగుల కృషి ఉందని జెన్ కో అండ్ ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. ఇక, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేసి, తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కలను త్వరలోనే నిజం చేస్తామన్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.