జగన్‌తో పొంగులేటి భేటీ.. తెరవెనక కమలం?

Publish Date:Feb 10, 2023

Advertisement

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. వ్యాపార వేత్త కూడా. అందుకే ఆయన రాజకీయంగా వేసే ప్రతి అడుగు వెనుక రాజకీయ ప్రయోజనాలతో పాటు  వ్యాపార ప్రయోజనాలను కూడా బేరీజు వేసుకోవడం కనిపిస్తుంది. అందుకే ఆయన అధికార బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్నా, ఇంత వరకు ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. అలాగని పార్టీలో ఉన్నారా అంటే అదీ లేదు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడమే కాదు, వ్యతిరేకంగా పోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  తనను  మోసం చేశారని, ఆశ చూపి అవమానాలకు గురి చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

అంతే కాదు దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని  బీఆర్ఎస్ నాయకత్వాన్ని సవాలు చేస్తున్నారు. మరో వంక బీఆర్ఎస్ నాయకులు  పొంగులేటి పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారే కానీ  ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే సాహసం చేయలేక పోతున్నారు. అంటే ఖమ్మం జిల్లాలో ఆయన బలమేమిటో, జిల్లా రాజకీయాలపై ఆయన కున్న పట్టు ఎంతో వేరే చెప్పనక్కర లేదు. ఆయన బలమైన రాజకీయ నాయకుడు, బలమైన వ్యాపార వేత్త...  రాజకీయాలను శాసించే అంగబలం, ఆర్థిక స్థోమత ఉన్న నాయకుడు.  

అయితే, అంతటి బలవంతుడు తమ రాజకీయ భవిష్యత్ విషయంలో ఎందుకు తడబాటు పడుతున్నారు. ఎందుకు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు? అంటే  అందుకు ఇదీ కారణమని చెప్పడం కొంచెం చాలా కష్టమే, కానీ, ఏదో ఒక బలమైన కారణం లేకుండా ఆయన ఇన్ని ఆలోచనలు చేయరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందులో రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలతో పాటుగా వ్యాపార వ్యవహారాలు, లావాదేవీలు కూడా ఉంటాయని అందుకే ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు.

బీఆర్ఎస్ కు ‘బ్రేకప్’ చెప్పిన తర్వాత ఆయన ఫస్ట్ లవ్ బీజేపీ.  ఆయన బీజేపీలో చేరుతున్నారనే  ప్రచారం బలంగా సాగింది. ముహూర్తాలూ  ఖరారయ్యాయి. అయితే, అది జరగలేదు.  కాంగ్రెస్ లో చేరే విషయంలోనూ అంతే.. ఆ తర్వాత వైఎస్సార్టీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది.  వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో, ఆ తర్వాత వైఎస్ సతీమణి విజయమ్మతో ఆయన భేటీ అయ్యారు. ఈ నేపద్యంలోనే ఆయన  వైఎస్సార్ టీపీలో చేరిక లాంఛనమే.. అనే ప్రచారం జరిగింది. 

అయితే వైఎస్ఆర్  టీపీలో చేరబోతోన్నారంటూ ప్రచారం ఊపందుకుంటోన్న వేళ.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.  వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబం, వైఎస్ జగన్ తో ఉన్న వ్యక్తిగత అనుబంధంతోనే ఆయనను కలిశారని చెపుతున్నారు.  నిజానికి  వైఎస్ కుటుంబంతో పొంగులేటికి సన్నిహత సంబంధాలు ఉన్న మాట నిజం, రాజకీయాలకు అతీతంగా ఆయన వైఎస్ కుటుంబాన్ని అభిమానిస్తున్నారనేది కూడా నిజమే కావచ్చును. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. ఖమ్మం లోక్ సభ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను కూడా గెలిపించుకోగలిగారు.

ఇప్పుడు ఆ పాత బంధాలను పెనవేసుకునే క్రమంలోనే ఆయన జగన్ రెడ్డిని కలిశారా? లేక ఇంకేమైనా సీక్రెట్ కనెక్షన్ ఉందా? అనేది తేలవలసి వుందని అంటున్నారు.  అయితే, జగన్ రెడ్డికి బీజేపీ అగ్రనాయకులతో ఉన్న సంబంధాల కోణం నుంచి కూడా ఈ భేటీని చూడవలసి ఉంటుందని  ఆ కోణంలోనూ  ఆలోచించవలసి ఉంటుందని అంటున్నారు. పొంగులేటి మీద బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కాదు, పార్టీ అగ్ర నేతలు మోదీ, అమిత్ షా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరి సమక్షంలో అది కుడా భారీ బహిరంగ సభ వేదికగా పార్టీలో చేర్చుకోవాలని, తద్వారా పార్టీలో జోష్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు పొంగులేటి చెయ్యి ఇవ్వడంతో మోడీ షా జోడీ ఇష్యూని సీరియస్ గా తీసుకుని జగన్ రెడ్డిని రంగంలోకి దింపారని అంటున్నారు. పొంగులేటిని పార్టీలోకి పార్టీలోకి తెచ్చుకునేందుకు కమల నాథులు జగన్ రెడ్డిని ప్రయోగించరా?  అనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అయితే నిజం ఏమిటన్నది ... పొంగులేటి అంతిమ నిర్ణయం ఏమిటో తెలిస్తేనే కానీ, ప్రపంచానికి తెలియదు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.