గణేష్ నిమజ్జన శోభాయాత్రపై రాజకీయమా?

Publish Date:Sep 7, 2022

Advertisement

రాజకీయ ప్రయోజనమే ఏకైక లక్ష్యం. అందు కోసం సమాజానికి హాని జరిగే పరిస్థితులు ఏర్పడినా పట్టించుకోకపోవడమే నేటి పార్టీల వైఖరిగా మారిపోయింది. కుల మతాలకు అతీతంగా ఒక సామాజిక ఉత్సవంలా ఏటా హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవానికి రాజకీయ మకిలి అంటించేందుకు కూడా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వెరవడం లేదు.

మరీ ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ అవకాశాన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలన్న ఆత్రం, తాపత్రయంతో పార్టీలు మంచి చెడుల విచక్షణ కోల్పోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, తెరాసల ఈ విషయంలో  ముందు వెనుకలు ఆలోచించకుండా ఎన్నికల లబ్ధి కోసం వెంపర్లాడుతున్నాయి.  గణేష్ మండపాల నుంచి నిమజ్జనాల వరకూ పార్టీలు తమతమ రాజకీయ లబ్ధి కోసం వివాదాలు సృష్టిస్తున్నాయి.

సామరస్య వాతావరణం దెబ్బతినే పరిస్థితి వచ్చినా వెనుకాడటం లేదు. ఇప్పుడు వినాయక నిమజ్జనం విషయంలో కూడా బీజేపీ, తెరాసలు ప్రమాదకరమైన రాజకీయ క్రీడకు తెర లేపాయి. వినాయక నిమజ్జనాలకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేయడం లేదంటూ బీజేపీ తీవ్ర పదజాలంతో విమర్శలకు తెరలేపింది.  ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా చేయకున్నా ట్యాంక్ బండ్ పైకి నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తామనీ, హుస్సేన్ సాగర్ లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తామనీ బీజేపీ ప్రకటించింది.   హుస్సేసాగర్ జలాలు కలుషితం కాకూడదన్న ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారెస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో  అధికారికంగా హుసేన్ సాగర్ ఒడ్డున గణేష్ నిమజ్జనానికి  ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది.

ఎందుకంటే గణేష్ మండపాలలో ప్రతిష్టించిన విగ్రహాలలో అత్యధికం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసినవే.  అయితే గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడాన్ని బీజేపీ విమర్శిస్తున్నది. కేవలం  హిందూ పండుగలపైనే ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తున్నారంటూ సున్నిత అంశాలను తెరపైకి తీసుకువచ్చి రచ్చ చేస్తున్నది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సజావుగా సాగనివ్వకుండా అడ్డుకోవాల ప్రభుత్వం చూస్తోందనీ, వచ్చే ఏన్నికలలో ఒక వర్గం మద్దతు కొసం ఆ వర్గం మెప్పు కోసమే సర్కార్ ఇలా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అంతే కాకుండా ట్యాంక్ బండ్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని అడ్డుకుంటే వాటిని   ప్రగతి భవన్ కు తీసుకొస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

సాగర్ లో కాదు ప్రగతి భవన్ లో   గణేష్ నిమజ్జనం చేస్తామని బండి సంజయ్ ప్రకటించడంతో వివాదం మరో లెవెల్ కు వెళ్లింది. ఓ వైపు గణేష్ ఉత్సవ కమిటీ మరో వైపు బీజేపీ   కేసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాగే నిరశన దీక్షకూ దిగాయి.  హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఉన్న ప్రాధాన్యత తెలిసి కూడా ఏర్పాట్ల విషయంలో కేసీఆర్ సర్కార్ పట్టనట్టు వ్యవహరించడం వెనుక కూడా రాజకీయమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ పరస్పర విమర్శలకు దిగడమే కాకుండా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సమయం సమీపిస్తున్నా అందుకు సంబంధించిన ఏర్పాట్ల ఊసే లేకపోవడంతో నిమజ్జనం రోజున ఏ అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించడం, అనంతరం గణేష్ శోభాయాత్రా ఒక సామాజిక కార్యక్రమంలా జనంలో సామరస్యం వెల్లివిరిసేలా నిర్వహించుకోవడం ఒక సంప్రదాయంగా వస్తున్న తరుణంలో రాజకీయం కోసం ఇటువంటి వాతావరణం ఏర్పడేలా రాజకీయ పార్టీలు వ్యవహరించడం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాలుష్యం కారణంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం హుస్సేన్ సాగర్ లో నిర్వహించరాదంటూ గత చాలా కాలంగా పర్యావరణ ప్రేమికులు ఆందోళన చేస్తున్న సంగతి విదితమే. అదే సమయంలో కోర్టు కూడా కొన్ని ఆంక్షలతో సూచనలూ చేసింది. అయితే గణేష్ నవరాత్రులకు ముందు నుంచే పర్యావరణ హిత ఉత్సవాల కోసం ప్రజలలో అవగాహన పెంచేలా భారీ ఎత్తున ప్రచారం చేయాల్సిన ప్రభుత్వం ఆ సమయంలో మౌనంగా ఉండి, ఇప్పుడు గణేష్ నిమజ్జన విషయంలో ఆంక్షలున్నాయంటూ ఏర్పాట్లు చేయకపోవడాన్నీ పరిశీలకులు తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా పరిస్థితి మరింత విషమించక ముందే ప్రభుత్వం నడుంబిగించి.. నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.