తెలంగాణలో పీక్స్‌కు చేరిన పొలిటికల్ హీట్..

Publish Date:Apr 16, 2022

Advertisement

తెలంగాణలో రాజకీయ ఉష్ణోగతలు వడివడిగా పరుగులు తీస్తున్నాయి. మూడు పాదయాత్రలు, ఆరు ఆందోళనలుగా టీ’ రాజకీయం రోడ్డెక్కింది. అధికార తెరాస సహ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ, వీధుల్లో ఓట్ల వేట సాగిస్తునాయి. అధికార తెరాస వరి వివాదాన్నిఅస్త్రం చేసుకుని బీజేపీ టార్గెట్’ గా కేంద్రం పై యుద్ధం ప్రకటించింది. రోడ్డెక్కింది. ఆందోళనను ఢిల్లీ దాకా తీసుకు పోయింది . అయినా కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ముడి బియ్యం కొంటామే తప్ప బాయిల్డ్ రైస్ కిలో కూడా తీసుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. దీంతో చేసేది లేక ఢిల్లీ ధర్నా ముగించుకుని, హైదరబాద్ చేరిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్గంతో ‘మమ’ అనిపించి వేసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ప్రకటించారు. అంటే, కేంద్రం చెప్పిన దానికి జీ హుజూర్ అని తల ఊపిండి. అంతే కాకుండా ఇంతవరకు యాసంగిలో  రారైస్’ ఎంతిస్తారో, ఎప్పుడిస్తారో చెప్పమని, కేంద్రం ఎన్ని లేఖలు రాసినా సమాధానం అయినా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వానికి, తత్త్వం ఎలా బోధ పడిందో ఏమో,కానీ, రారైస్’ తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కేంద్రానికి లేఖ రాసింది. అక్కడితో తెరాస సాగించిన కేంద్రం పై వరి యుద్ధంలో మరో అంకం ముగిసింది. ఇప్పుడు ఇంకో అంకం మొదలైంది .. ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చూడవలసి వుంది. అయితే, ఒకటి మాత్రం నిజం, వరి సాగు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం అంటూ ఏదీ లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రైతులను పావులగా వాడుకుంటోందని సామాన్య రైతులకు కూడా తెలిసి పోయింది.  

అధికార పార్టీ, ఆ విధంగా రాజకీయ ఆరాటం చూపిస్తుంటే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమదైన పంథాలో పాదయాత్రలు, పబ్లిక్ మీటింగ్స్, ఆందోళనలతో జనంలోకి వెళ్లేందుకు పరుగులు తీస్తున్నాయి.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు.జోగులాంబ గద్వాల నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. మైనార్టీలంటే కేసీఆర్‌కు భయమని, కేసీఆర్ నిజమైన హిందువైతే అలంపూర్ ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కేసులన్నీ తిరగదోడతామని, అక్బరుద్దీన్‌ను వదిలే ప్రసక్తే లేదని బండిసంజయ్ హెచ్చరించారు. బండి ప్రసంగంలో కొత్తదనమేమీ లేక పోయినా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నట్లుగా హిందుత్వమే ప్రధాన అజెండాగా బండి యాత్ర సాగుతుందనే సంకేతాలు అయితే స్పష్టంయ్యాయి. ఒవైసీల మెడ మీద కట్టి పెట్టి, తెరాస / కీసీఆర్’ను కొట్టేందుకు బండి వ్యూహాత్మకంగా అజెండాను ఫిక్స్ చేసుకున్నారు. 
మరోవంక సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ‘పీపుల్స్‌ మార్చ్‌’ పేరుతో చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వస్తున్న నేపధ్యంలో, ఆయన యాత్రను ఇతర జిల్లాలలో కొనసాగించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో ‘పీపుల్స్‌ మార్చ్‌’ సెకండ్ ఫేజ్’కు సంబందించిన ప్రకటన ఉండవచ్చని అంటున్నారు. 

అదలా ఉంటే భట్టి విక్రమార్క, పాదయాత్రలో లెఫ్ట్ పార్టీల జెండాలు కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆశక్తి రేకెత్తిస్తోంది. గతంలో తొమ్మిది వామపక్ష పార్టీల మద్దతుతో సాగిన వైఎస్సార్ పాదయాత్రలో కనిపించిన దృశ్యాలు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయని అంటున్నారు. భట్టి మెడలోనూ కాంగ్రెస్ కడువాను అల్లుకున్న సిపిఐ, సిపిఎం పార్టీల కండువాలు కని పిస్తున్నాయి. నిజానికి, ఇంతవరకు  కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్య అధికారిక ఒప్పందం ఏదీ కుదరక పోయినా, భవిష్యత్ అలాంటి ఒప్పదం ఉంటుందనేందుకు, ఇది ఒక సంకేతం అనికోవచ్చని అంటున్నారు. 

మరోవంక తెలంగాణలో రాజన్న రాజ్యం లక్ష్యంగా, జెండా ఎత్తిన  వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 56వ రోజుకు చేరుకుంది. షర్మిల పాదయాత్రకు  పెద్దగా స్పందన లేకున్నా, ఆమె ‘తగ్గేదేలే’ అంటూ నడక సాగిస్తూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.కేసీఆర్‌’ దొర అని సంభోదిస్తూ ఆయన పాలన తాలిబాన్లను తలపిస్తోందని, ప్రధాన ప్రతిపక్షాలకంటే ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అయితే, ఎన్నికలలో ఆమె ప్రభావం ఏ మేరకు ఉంటుందని అనేది ఇప్పుడే చెప్పే పరిస్థితి అయితే లేదు. 

నిజానికి, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది. కానీ, ఎన్నికలు గుమ్మలోకి వచ్చాయనే విధంగా రాజకీయ పార్టీలు, నాయకులు హైరాణ పడిపోతున్నారు, ఆవేశంతో ఊగిపోతున్నారు. సరే, ఇక భాష సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన భాషలో ఆయన మాట్లడుతున్నారు. తెరాస నాయకులు ఆయన్ని ఫాలో అవుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి, వారివారి   అనుచర గణాలు, అంతా యథారాజా ... పద్దతిలో చక్కగా బూతులాడుకుంటున్నారు. అయితే, రాజకీయ పరిశీలకులు మాత్రం అన్ని డ్రామాలు చూస్తున్న ప్రజలు చివరకు ఏమిచేస్తారు అనేది ఉహించడం ప్రస్తుతానికి కొంచెం చాలా కష్టం అంటున్నారు. అయినా తొందరేముంది. ముందస్తు విషయంలోనూ ముఖ్యమంత్రి వెనకడుగు వేశారని  విస్వసనీయంగా తెలుస్తున్నప్పుడు, ఇప్పటినుంచే ఎందుకు తొందరా .. చూడాల్సింది చాల్వుంది ..వేచి చూద్దాం అంటున్నారు. చూద్దాం.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.