రాజకీయ రోహిణి కార్తె ముందుగానే వచ్చేసింది...?

Publish Date:Jan 25, 2023

Advertisement

శివరాత్రి (ఫిబ్రవరి 18) వచ్చేస్తోంది. శివ శివా అంటూ చలి వెళ్లిపోతుంది. ఇక అక్కడి నుంచి హీట్ పెరిగిపోతుంది. అదే సమయంలో (ఫిబ్రవరి 17) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పుట్టిన రోజు.. అదే రోజున నూతన సచివాలయం ప్రారంభోత్సవం. ఇక అక్కడి నుంచి రాష్ట్రంలో మండే ఎండలకు పోటీగా పొలిటికల్ హీట్  పరుగులు తీస్తుందని అందుకు సంబంధించి సంకేతాలు స్పష్టమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 ముఖ్యమంత్రి కేసేఆర్  ఆరు నూరయినా, నూరు ఆరైనా.. మూడవ సారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని గట్టి  పట్టుమీదున్నారు. మరో వంక కేంద్రంలో హ్యాట్రిక్  కోసం ఆరాట పడుతున్న కమల దళం బీజేపీ, రాష్ట్రంలోనూ అధికారాన్ని అందుకునేందుకు అంతే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కేసేఆర్ రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధిస్తే, కేంద్రంలో ముచ్చటగా మూడవసారి ప్రధాని పీఠం కోసం నరేంద్ర మోడీ సాగిస్తున్న,హ్యాట్రిక్   యాగానికి బ్రేకులు పడే అవకాశం లేకపోలేదు. అందుకే, కేసేఆర్ అడుగులు జాతీయ రాజకీయాల వైపు పడకుండా అడ్డుకునేందుకు బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా వ్యుహాలు రచిస్తున్నారు. ఇటు మోడీ షా  అటు కేసీఆర్ ఎవరికి వారు వ్యూహ.. ప్రతి వ్యూహాలు రచిస్తూ పొలిటికల్ హీట్‌ను పీక్స్ కు తీసుకుపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. 

నిజానికి రాష్ట్రంలో ఇప్పటికే  పొలిటికల్ హీట్ సాధారణ ఉష్ణోగ్రతలను దాటేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగంగా కేంద్రంపై ప్రకటించిన యుద్ధం పతాక స్థాయికి చేరింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి  రాష్ట్రంలో ఉనికి లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, గణతంత్ర దినోత్సవాన్ని కూడా రాజకీయ రొంపిలోకి లాగారు. రాజ్యాంగ వ్యవస్థల(గవర్నర్)తోనూ విభేదాలను పెంచుకున్నారు.ఈ విభేదాల కారణంగా, గణతంత్ర దినోత్సవం సైతం రాజకీయ రణతంత్రంగా మారింది. చివరకు గణతంత్ర వేడుకల విషయంలోనూ రాష్ట్ర హై కోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. రాజకీయ విభేదాలు రాజ్యాంగ విధులకు అవరోధంగా మారే పరిస్థితి వచ్చిందంటే, రాజకీయ ఉష్ణోగ్రతలు ఏ స్థాయికి చేరుకున్నాయో వేరే చెప్పనక్కర లేదు. 

ఈ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీతో పోరు విషయంలో ఇక చావో రేవో తేల్చుకునేదుకు సిద్డమయ్యారనే విషయం స్పష్టమైంది. అందుకే  ఆయన నిండా మునిగినోనికి చలేంటి అన్న రీతిలో  పొలిటికల్ హీట్‌ను మరింత రాజేస్తున్నారు. ఫిబ్రవరిలో కొత్త సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించిన తర్వాత ఏ క్షణమైనా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల దిశగా అడుగులు వేసే అవకాశాలను ఒక వైపు పరిశీలిస్తూనే.. ఇంకోవైపు బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు కేసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే తన ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు వరుసగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను, బీజేపీ హిందుత్వ రాజకీయాలను, రాహుల్ గాంధీకి దీటుగా ఎండగడుతున్నారు. తగ్గేదే లే అంటూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. 

ఇదలా ఉంటే, ఫిబ్రవరిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఎన్నికల’ బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రతువు ముగిసిన వెంటనే  కేసీఆర్ బీఆర్ఎస్  విస్తరణ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి 17వ తేదీన కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించిన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టినట్లు సమాచారం. అంతకు మందే ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ కార్యక్రమాన్ని రాజకీయంగా కూడా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభ నిర్వహణకు ప్లాన్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సభ నిర్వహణకు కమల నాధులు పూనుకున్నారు. ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన తరహాలో, అన్ని జిల్లా కేంద్రాలలో భారీ బహిరణ సభలకు భారాస సిద్డంవుతున్నట్లు తెలుస్తోని. అందుకు కౌంటర్ గా  బీజేపీ దండు కూడా తెలంగాణ దండయాత్రకు సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ఫిబ్రవరిలోనే పొలిటికల్ హీట్ పీక్ కు చేరుతుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.