బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ క్లారిటీ?

Publish Date:Jan 16, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ఇటీవలి కాలం వరకూ అత్యంత సంక్లిష్టంగా ఉండేది. ఔను అభివృద్ధీ నినాదానికీ.. సంక్షుమం ప్రలోభాలకూ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న భావన ఉండేది. అన్ని ఫ్రీ.. అంతా ఫ్రీ విధానానికీ.. కష్టపడదాం, పని చేద్దాం సంపద పెంచుదాం అన్న విజన్ కూ మధ్య పోటీ అన్న వాతావరణం ఉండేది.

అయితే ఇప్పుడు ఒక్క సారిగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. తెరాస బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని ఏపీ గడ్డపై అడుగుపెట్టడంతో ఇక ఫ్రీ విధానానికి చెల్లు చీటీ పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ అభివృద్ధి లేమి, పరిశ్రమలు పరార్ అంటూ ఏపీని చూపి తెలంగాణలో ఓట్లు దండుకున్న తెరాస ఇప్పుడు అదే అభివృద్ధి నినాదంతో ఏపీలో అడుగు పెట్టేసింది. ఏపీలో అడుగు పెట్టడానికి తెరవెనుక రాజకీయం మరేదో ఉందన్న అనుమానాలను పక్కన పెడితే.. ఆత్మగౌరవం, అభివృద్ధి అజెండాను బీఆర్ఎస్ తెరపైకి తీసుకు వచ్చింది.

అదే సమయంలో గతంలో అంటే 2014, 2019 ఎన్నికల సమయంలో అప్పట్లో తెరాసగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రాంతాన్ని, ఆంధ్రప్రజలను తూలనాడిన వ్యక్తి ఇప్పుడు ఏపీలో రాజకీయం చేస్తానంటూ ముందుకు రావడంతో.. ఆయనకు చెక్ పెట్టేందుకు ఏపీ జనం సమాయత్తమౌతున్నారు.  బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి నియామకం తరువాత రాష్ట్రంలో గతంలో ఏపీ లక్ష్యంగా, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులు టార్గెట్ గా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది.  అంత మాత్రాన  బీఆర్ఎస్ ప్రభావం ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం ఉండదా అంటే కచ్చితంగా ఉంటుంది. నిజానికి, ఒక్కఎపీలోనే కాదు దేశంలో ఏ ఒక్క ఒక రాష్ట్రం నుంచి పేరున్న పార్టీలు ,వ్యక్తులు ఎవరు కూడా కేసేఆర్ తో చేతులు కలిపేందుకు, సిద్ధంగా లేరు.  అయినా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలు, ప్రజాసంఘాలను కూడగట్టి జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.  సో.. బీఆర్ఎస్ ప్రభావం ఏపీ పై అసలే ఉందని చెప్పలేము, కానీ ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది విషయంలో మాత్రం దాదాపు ఏకాభిప్రాయమే వ్యక్తమౌతోంది.

ఆయన ఏపీలో నిలదొక్కుకోవడం అంత వీజీ కాదనేదే. అన్నిటికీ మించి బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ.. ఎవరు ఔనన్నా కాదన్నా దెబ్బకొట్టేది.. వైసీపీ ప్రయోజనాలనే అన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.  కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసేఆర్, అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటే, ఎలా అనుమతిస్తామని జనం అంటున్నారు? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసేఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును ఎలా మరచిపోగలమంటున్నారు? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్ కు  రెడ్ కార్పెట్  వేసి స్వాగతం ఎందుకు పలుకుతారని ప్రశ్నిస్తున్నారు.   కేసీఆర్, నేను మరిపోయాను నమ్మడానికి సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. కేసీఆర్ పట్ల వ్యతిరేకతే ఆయన పార్టీని రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతిస్తున్న వైపీపీపైనా పడక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

నిజానికి ప్రాంతీయ వాదం పునాదిగా, రాజకీయంగా ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆయన అవసరాల కోసం    తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని, పక్కన పెట్టి జాతీయ నినాదాన్ని అందుకున్నారు. అందు కోసం  ఆయన దసరా పండగ రోజున తెలంగాణ భవన్ వేదికగా, తెరాస పార్టీ పేరును మార్చారు. భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’ అనే పదాన్ని తెసీసి ‘భారతీయ’ అనే పదాన్ని చేర్చారు.   ప్రొఫెసర్ కోదండ రామ్’  చెప్పినట్లుగా తెరాస పేరు మార్పు వెనక ఉన్న మూల సూత్రం మాత్రం తెలంగాణలో అధికారాన్ని, కుటుంబ పాలనను నిలుపుకోవడం. ఇదొక్కటే ఇప్పుడు కేసీఅర్ ముందున్న లక్ష్యం. ఇదొక్కటే ఆయన ముందున్న సవాలు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకుని 1200 యువకుల బలిదానాల బాటలో అధికార పీఠాన్ని అందుకున్న కేసేఆర్, వారి త్యాగాలన్నిటినీ విస్మరించి, ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నారు. ఈ కొత్త దారికి అడ్డుపడేది ఏదైనా ఉంటే అది తెలంగాణ పదమే అన్న నిర్ణయానికి వచ్చి పార్టీలోని తెలంగాణ పేరును తుడిచేసి భారత్ అని చేర్చారు. ఈ మార్పు  తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను  ఎలా ప్రభావితం చేస్తుంది.  జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే,   ఆంధ్ర ప్రదేశ్  రాజకీయాలను ఏ మేరకుప్రభావితం చేస్తుంది? అంటే.. ఏపీ జనులు మాత్రం బీఆర్ఎస్ కు ఇక్కడ స్థానం లేదని అంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ పార్టీని భుజానికి ఎత్తుకుంటున్న వైకాపాను తిరస్కరించడానికి కూడా జనం సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. 
 

By
en-us Political News

  
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.