Publish Date:Jul 19, 2022
తెలుగు రాష్ట్రాల మద్య పాత పంచాయితీ మళ్లీ కొత్తగా మొదలైంది. పోలవరం ఎత్తు అంశాన్నిమళ్ళి తెరమీదకి తీసుకు వచ్చింది తెలంగాణా ప్రభుత్వం. ఇటీవలి గోదావరి వరదలతో ఈ చర్ఛ పోలవరంపై చర్చ మళ్ళి మొదలైంది. పోలవరం పూర్తయితే భద్రాచలానికి ముంపు ముప్పు పెరుగుతుందన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అయితే మంత్రి పువ్వాడ వ్యాఖ్యలను ఏపీ మంత్రి అంబటి ఖండించారు. పోలవరంపై అన్ని సర్వేలు చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు ఇచ్చిందన్న అంబటి రాంబాబు వరదలు వచ్చినప్పుడల్లా పోలవరం ఎత్తుపై రాజకీయం చేయడం సరి కాదన్నారు ఆయనకు హితవు పలికారు. పోలవరం గేట్లు ఎత్తడంలో జాప్యం వల్లే ఈసారి వరద తీవ్రత పెరిగిందని విమర్శించిన పువ్వాడ, గోదావరికి ఎప్పుడు వరద వచ్చినా ఇదే పరిస్ధితి పునరావృతమౌతుందనీ అందుకే పోవలరం ఎత్తు తగ్గించాలన్నదే తమ డిమాండ్ అని పునరుద్ఘాటించారు పోలవరం స్పిల్ వెల్ 50,000 క్యుసేక్కులకి పెంచారు .ప్రాజెక్ట్ లో గరిష్టం గా 15 రోజులు నీటి మట్టం నిలవ ఉండే అవకాశం ఉంది. అందు వల్ల భద్రాచలాని కి ఎలాంటి ముప్పు ఉండదు. భద్రాచలం లో 80 అడుగుల కరకట్ట నిర్మాణం జరిగింది.
పోలవరం తో సంభందం లేకుండా ప్రస్తుతం 50నుంచి60 అడుగుల నీటిమట్టం నమోదు అవుతోంది. పోలవరం నుంచి వచ్చే నీటి మట్టం 43 అడుగులని దాని వల్ల భద్రాచలానికి ఎటువంటి ముప్పు ఉండదన్నది ఏపీ వాదన. పనిలో పనిగా పువ్వాడ కొత్త డిమాండ్ ను కూడా తెరమీదకు తీసుకువచ్చారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలనూ తిరిగి తెలంగాణలో కలిపేయాలన్నారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలలోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఎటపాక, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల పంచాయతీలను తెలంగాణలో కలపాలని, వరద వచ్చినప్పుడల్లా ఈ గ్రామాలలో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ చేశారాయన. రాజకీయంగా ఇబ్బంది వచ్చిన ప్రతి సారీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాల అంశాన్ని తెరమీదకు తేవడం పరిపాటిగా మారిందని ఏపీ విమర్శిస్తోంది.
పోలవరం కారణంగా భద్రాచలంకు ముప్పు ఏర్పడుతుందన్న వాదనకు ఎలాంటి హేతుబద్ధత, శాస్త్రీయత లేదని చెబుతోంది. గతంలో కూడా గోదావరికి భారీ వరదలు వచ్చాయని,కానీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండానే పోలవరాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని,కేంద్రం నిధులు సమకూరుస్తోందని,ఏదైనా కేంద్రం చేతిలోనే ఉందని ఏపీ చెబుతున్నది. రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చే ఇటువంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమజంసం కాదని అంటోది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/polavaram-dispute-raises-again-25-140086.html
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.