మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. బాస్కెట్‌బాల్ కోచ్‌పై పోక్సో కేసు..!
Publish Date:Aug 4, 2026
Advertisement
మైనర్ బాలికను బాస్కెట్ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదం డ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కౌలార్‌లోని గౌర్డియమ్ స్కూల్ అండ్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాధిత బాలిక గత మూడేళ్లుగా బాస్కెట్‌బాల్ ఆడుతోంది. ఈ క్రమంలోనే పలు టోర్న మెంట్లలో పాల్గొంటున్న ఆమెను పృథ్వీశ్వర్ రెడ్డి పలుమార్లు అసభ్యకర వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరి 18న జోగులాంబ గద్వాల్ జిల్లా ఉట్నూర్ జెడ్పీ మైదానంలో జరిగిన ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో మహిళల ఫైనల్ మ్యాచ్ అనంతరం నిందితుడు బాలికతో పాటు ఇతర మహిళా క్రీడాకారుల వైపు అసభ్యకరమైన సంజ్ఞలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మ్యాచ్‌కు ముందు కూడా బాలికను ఉద్దేశించి లైంగిక, కులపరమైన అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా 2025 డిసెంబర్ 21న మాదా పూర్‌లోని డీబీఏ అకాడమీలో జరిగిన వర్సిటీ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ లో బాలిక శారీరక రూపాన్ని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2026 జూన్ 7న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జెడ్పీ హెచ్‌ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన టోర్నమెంట్‌లోనూ బాలికను పోటీలో పాల్గొన డంపై ప్రశ్నిస్తూ, డాక్యు మెంట్లు కోరడంతో పాటు దూషణలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలపై బాలిక తల్లిదండ్రులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయిం చారు. తొలుత గత నెల 24న ఆర్‌సీ పురం పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, అనంతరం దానిని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు క్రైమ్ నంబర్ 1105/2026 కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 75(1)(iv)తో పాటు పోక్సో చట్టం-2012లోని సెక్షన్ 11, 12 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. POCSO case against basketball coach, minor girl, Coach Prithviraj Reddy, DBA Academy,CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police
http://www.teluguone.com/news/content/pocso-case-against-basketball-coach-36-228002.html





