నాయకత్వం మార్పు నిజమేనా?

Publish Date:Aug 23, 2012

Advertisement

రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితికి తోడు ముఖ్యమంత్రిని, పిసిసి చీఫ్‌ బొత్సను కూడా మారుస్తారని డిల్లీ నుండి గల్లీ వరకు వార్తలు జోరందు కుంటున్నాయి. దానికి ముహూర్తం ఈ నెల 27 అనికూడా కొందరు జోస్యం చెపుతున్నారు. 27లోపు దాని తాలూకూ ప్రకటన కూడా వెలువడుతుందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రిగా జానారెడ్డి పేరు దాదాపు ఖరారైదని కూడా చెబుతున్నారు. ఆయనకు సంబందించిన పూర్తి వివరాలను ఇంటిలిజెన్స్‌ అధికారులనుండి తెప్పించుకున్నారని కూడా చెబుతున్నారు. జానారెడ్డి అయితే అటు సీమాంద్రకు, ఇటు రాయలసీమకు కావల్సిన వ్యక్తిగా ఉండటమే కాక, అందరికీ కావల్సిన పనులను చేసి పెడతారని ఆ విషయంలోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విఫలమయ్యారని ఎమ్మేల్యేలను సంతృప్తి పరచి వారిని సమన్వయంతో ముందుకు తీసుకు పోయే నాయకుడు కావాలని భావించిన అధిష్టానం జనార్ధనరెడ్డి పేరు పరిశీలనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే రేసులో మర్రి శశిధర్‌రెడ్డికూడా ఉన్నట్లు ఆయన తన లాబీతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో పిసిసి ప్రసిడెంట్‌గా కన్నా లక్ష్మీనారాయణ పేరు దాదాపుగా ఖరారయ్యారన్న వార్తలు వినవస్తున్నాయి.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీకి ఒక బలమైన సామాజిక వర్గం అండ అవసరం ఉందని గత ఎన్నికల్లో కాపులు పార్టీకి దన్నుగా ఉన్నారని అదే వర్గాన్ని తమ వెంట ఉంచుకోవడం వల్ల పార్టీకి లాభంగా భావిస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్‌ కన్నాకు పిసిసి పగ్గాలు ఇవ్వాలని సూచన ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. బొత్స ఎవరినీ సమన్యయం చేసుకోలేక పోతున్నారని, ఒకవర్గానికి చెందిన వారికే ప్రాతినిత్యం వహిస్తూ పార్టీ గురించి ఆలోచించడం లేదని ఆగ్రహం అధిష్టానంలో ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అదే కన్నా అయితే మొదటినుండి ఏ వర్గానికి అనుబంధంగా లేరని అందుకే తనకంటే జూనియర్‌ అయిన బొత్స పిసిసి అద్యక్షుడయినా కన్నా కలత చెందకపోవడం తన పరిణితికి నిదర్శనమంటున్నారు.

By
en-us Political News

  
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.