పీకే నివేదిక తేల్చేసింది.. వైసీపీ ఓటమి తథ్యం..

Publish Date:Sep 19, 2022

Advertisement

పీకే నివేదిక తేల్చేసింది. ఫ్యాన్ తిరగడం ఇక అసాధ్యమని ఖరారు చేసేసింది. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని ఖరారు చేసేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం కల్లేనని, జగన్ సీఎం పదవి నుంచి దిగిపోవడం తథ్యమని ప్రశాంత్ కిషోర్ రైట్ హ్యాండ్ అయిన రిష్ రాజ్ సింగ్ తాజా నివేదిక పేర్కొంది. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయమే లక్ష్యం అంటూ క్యాడర్ ను దిశా నిర్దేశం చేస్తున్న జగన్ ఈ నివేదికతో కంగు తిన్నారని పార్టీ క్యాడరే చెబుతోంది. ఇదేం నివేదిక, ఇదేం కథ అంటూ పీకే రైట్ హ్యాండ్ రిషి రాజ్ సింగ్ పైనా ఆయన బృందంపైనా జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని క్యాడర్ అంటోంది.
 
వచ్చే ఎన్నికల్లో మొత్తం 175కి 175 ఎమ్మెల్యే స్థానాలను కొల్లగొట్టాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీతోపాటు ఏ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా ఉండేందుకు జగన్ అండ్ కో వ్యూహాలు రచిస్తున్నాయి.   తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించాలన్న లక్ష్యంతో ఆ నియోజకవర్గ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించేసి గెలిస్తే మంత్రి పదవి తాయిలంగా ఇస్తానని కూడా జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే తెలుగుదేశం నాయకులు పోటీ చేస్తారని భావిస్తున్న ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఖాయమంటూ జగన్ ఆశపెట్టిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి, ప్రభుత్వ పనతీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న అంశాలపై ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా జగన్ కోరిన మీదట.. ప్రశాంత్ కిషోర్ తరఫున జగన్ పార్టీ వ్యూహకర్తగా పని చేస్తున్న రిష్ రాజ్ సింగ్ తన బృందంతో జరిపిన సర్వేలో వెల్లడైన అంశాలు జగన్ కు దిమ్మతిరిగేలా ఉన్నాయని పార్టీ క్యాడరే చెబుతున్నారు. జగన్ పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఉన్నదున్నట్లుగా పొందుపరుస్తూ రిష్ రాజ్ సింగ్ టీమ్ ఇన్చిన నివేదికతో జగన్ షాక్ అయ్యారని అంటున్నారు. 

ప్రజా సంక్షేమం  పేరిట ఈ మూడున్నరేళ్లలో  కోట్లాది రూపాయిలు  బటన్ నొక్కి పందేరం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరు చందమే అయ్యిందని, ఇక మిగిలిన స్వల్ప కాలంలోనైనా  అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని...పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నది ఆ నివేదిక సారాంశంగా చెబుతున్నారు.  రాష్ట్రంలో ముఖ్యంగా ఉద్యోగులు, యువతతో పాటు తటస్టులంతా అభివృద్ధిని కాంక్షిస్తున్నారని నివేదికలో రిష్ రాజ్ సింగ్ టీమ్ విస్పష్టంగా పేర్కొందని అంటున్నారు.
 సంక్షేమ పథకాల పేరిట.. ప్రతి నెలా ఏదో ఒక పథకం పేర.. బటన్ నొక్కుతూ...నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగ దు బదిలీ చేస్తున్నా ఆ పథకాల లబ్ధి దారులు కూడా రాష్ట్రంలో అభివృద్ధి అడుగంటటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నివేదిక తేల్చేసిందట.

అలాగే మూడు రాజధానులంటూ జనగ్ చేస్తున్న విన్యాసాల పట్ల కూడా ప్రజలలో అసంతృప్తి గూడుకట్టుకుందనీ, మెజారిటీ ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారనీ నివేదిక వెల్లడించిందని చెబుతున్నారు. అలాగే  రాష్ట్రంలో రహదారుల దుస్థితికి సంబంధించి ప్రతి రోజు సోషల్ మీడియాలో లక్షలాది పోస్టులు దర్శనమిస్తున్నాయని.. రహదారులు బాగు చేసేందుకు కూడా వైయస్ జగన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అంటూ నెటిజన్లు చేస్తున్న ట్రోలింగ్ కూడా ప్రజలపై ప్రభావం చూపి జగన్ సర్కార్ పట్ల అసంతృప్తి పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని నివేదిక వెల్లడించిందని చెబుతున్నారు.

మరో వైపు పెట్టుబడులు లేక పారిశ్రామిక రంగం కుదేలై పోయిందని.. రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్డున పడిందనీ,   ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న జగన్ హామీ నెరవేరకపోవడం పట్ల కూడా ప్రజలలో ముఖ్యంగా యువతలో అసమ్మతి గూడుకట్టుకుందని అంటున్నారు.  సీపీఎస్ రద్దు అంశంలో సీఎం జగన్ మాట తప్పారని, మడమ తిప్పారన్న ఆగ్రహం ఉద్యోగులలో వెల్లువెత్తుతోందని నివేదిక పేర్కొంది.    

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.