పెంచడానికి లేని నిబంధనలు,తగ్గించడానికి ఎందుకు?

Publish Date:Jun 6, 2012

Advertisement

పెట్రోల్ ధరలను కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సాహంగా పెంచినప్పటికీ సమయంలో అడ్డురాని ఎన్నికల నిబంధనలు తగ్గించడానికి ఏ విధంగా అడ్డువస్తాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చమురు కంపెనీలు పెంచిన ధరలో రెండు రూపాయలు తగ్గించడానికి ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతం పన్ను తగ్గించుకోవడం ద్వారా మరో 1.30 పైసలు తగ్గించడానికి ముందుకు వచ్చింది. ఈ స్థితిలో పెట్రోల్ ధర 3నుంచి 3.50రూపాయల వరకు తగ్గే అవకాశం వుంది. కాని ఎన్నికల నియమావళి అమల్లో వున్నందున ధర తగ్గించడానికి వీలులేదని ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు కేంద్రం లీటరుకు 2రూపాయలు తగ్గించింది. కాని రాష్ట్రప్రభుత్వం మాత్రం ఇంకా పన్ను తగ్గించలేదు. 15వ తేదీ వరకు ఎన్నికల నియమావళి అమల్లో వుంటుంది..అంటే జూన్ 15 తేదీ వరకూ ధరలు తగ్గించడం సాధ్యం కాదు. ఈ వ్యవధిలో ప్రజలు పెంచిన ధరల ప్రకారమే పెట్రోలు కొనుగోలు చేయాలి. అసలు ఉప ఎన్నికలే దండగమారి వ్యవహారం అని భావిస్తున్న ప్రజలు, ధరలు తగ్గించకుండా ఎన్నికల కమీషన్ అడ్డుపడుతున్నందుకు పెట్రోల్ వినియోగించే ప్రతి వ్యక్తి నష్టపోతుంటే, పన్నువసూలు చేసే ప్రభుత్వాలు ఈ 16రోజులలో వందలకోట్ల రూపాయలు లాభం పొందే అవకాశం కలిగింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పన్ను తగ్గిస్తుందా? పెంచిన ధరకు ప్రజలు అలవాటు పడ్డారులే అని వదిలేస్తుందా? చూడాలి.

By
en-us Political News

  
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.