వ్యక్తిగత దూషణలు - ప్రజాస్వామ్య విలువల పతనం

Publish Date:Apr 16, 2026

Advertisement

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దులు దాటిపోయింది. విమర్శ,  వ్యక్తిగత దూషణల మధ్య రేఖ చాలా పల్చగా మారుతోంది. ముఖ్యంగా స్టాండప్ కామెడీ,  సోషల్ మీడియా వేదికలుగా పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర నాయకుల వ్యక్తిగత జీవితాలను విమర్శల పేరుతో కించపరచడం అనే ఒక  ప్రమాదకరమైన ధోరణికి ప్రబలుతోంది. అనుదీప్ కటికల, రఫీక్ వంటి వ్యక్తులు కామెడీ ముసుగులో చేస్తున్న వ్యాఖ్యలు కేవలం హాస్యం కోసం మాత్రమే కాకుండా, ఒక పథకం ప్రకారం జరుగుతున్న రాజకీయ కుట్రగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెలుగు వన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు, అనుదీప్, రఫీక్ వంటి వారు స్టాండప్ కామెడీ ముసుగులో చేస్తున్న వికృత వ్యాఖ్యల వెనుక ప్రత్యర్థి రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉందన్నారు.  పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి నాయకుల ప్రజాదరణను నేరుగా ఎదుర్కోలేక, వారి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న వ్యూహంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.  

అయితే.. ఈ వ్యూహం తరచుగా దెబ్బతింటోంది. బూమరాంగ్ అవుతోంది.  బాలయ్య,  పవన్ కళ్యాణ్ వంటి నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు, అది వారి అభిమానులలో ఆవేశాన్ని పెంచడమే కాకుండా, సాధారణ ప్రజల్లో కూడా వారి పట్ల సానుభూతి ఏర్పడడానికే దోహద పడుతోంది.  రాజకీయాల్లో విమర్శలు సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప, కుటుంబ సభ్యులను లేదా వ్యక్తిగత విషయాలను లాగడం రాజకీయ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తుందని అడుసుమిల్లి అన్నారు.  

కమెడియన్ల అరెస్టులు,  పోలీసు చర్యలు ఒకవైపు జరుగుతున్నా, ఈ విద్వేష ప్రసంగాలు ఆగడం లేదు. ఇది సమాజంలో అసహనాన్ని పెంచి, అభిమాన సంఘాల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావాలనే తపనతో చేసే ఇటువంటి వ్యాఖ్యలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. న్యాయస్థానాలు,  పోలీసు యంత్రాంగం ఇటువంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించకపోతే, భవిష్యత్తులో రాజకీయ విమర్శలు పూర్తిగా అభ్యంతరకరమైన వ్యక్తిగత దూషణలుగా మారిపోయే ప్రమాదం ఉందంన్నారు అడుసుమిల్లి.  

రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి వివాదాలు ఓటర్ల నిర్ణయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ ఓటర్లు,  మహిళా ఓటర్లు ఇటువంటి వ్యక్తిగత దాడులను అసహ్యించుకుంటారు. ఏ పార్టీ అయితే ఇటువంటి చర్యలను ప్రోత్సహిస్తుందో, ఆ పార్టీకి ప్రజల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. భవిష్యత్తులో రాజకీయ పార్టీలు తమ సోషల్ మీడియా విభాగాలను, మద్దతుదారులను నియంత్రించకపోతే, రాజకీయ చర్చలు కేవలం విమర్శలకే పరిమితమై అభివృద్ధి అజెండా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. గౌరవప్రదమైన రాజకీయ వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అడుసుమిల్లి, వైసీపీయుల వ్యాఖ్యలకు ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతోందని చెప్పారు. 

 

 

By
en-us Political News

  
కాంగ్రెస్ లో సిఎం అభ్యర్థి విషయంలో పార్టీ ఫ్లోర్ లీడర్ సతీషన్, సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. అధిష్ఠానం మొగ్గు సతీషన్ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మెజార్టీ ఎమ్మెల్యేలు, అధిష్టానం ఆశీస్సులతో పాటు సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, శశి థరూర్ లాంటి వారి మద్దతు ఎవరికి దక్కుతుందో తెలియాల్సి ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రధానంగా పేదలు, మహిళలు, రైతులు, యువతలకు ప్రయోజనం చూకూర్చే అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఎస్ నెక్ట్స్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న  ఎసిబి కార్యాలయంలో జరుగనున్నవిచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. 
 మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకాణిపై టిడిపి శ్రేణులు ఫైర్ అయ్యాయి.
గత ఏప్రిల్ నెలలో మహరాష్ట్ర నుంచి తెలంగాణలో ఎంటరై అయి ఇద్దరిని చంపేసిన గజరాజు ఉదంతం తెలిసిందే. తాజాగా  ప్రస్తుతం మరో  ఏనుగుల గుంపు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని ఆటవిశాఖ అధికారులు చాటింపు వేశారు.
Publish Date:May 23, 2023
If AL Basham were alive today, he would have written a book with this title. In these turbulent times, when the very existence of democracy, secularism...
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైకి ఏ కారణం చెప్పినా ఆయన బీహార్ పర్యటన మాత్రం కచ్చితంగా తన జాతీయ రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకునే దిశగా మరో అడుగేనని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆయన వేసిన అడుగులకు ఎటువంటి సత్ఫలితాలూ రాలేదు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి రాకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుందని, సీఎం కేసీఆర్‌ సభకు హాజరు కాని వాళ్లకు భవిష్యత్తులో లోన్లు ఇవ్వరని బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వాట్స్‌ప్‌లో సందేశాలు పంపేరు.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బులంద్‌షెహ‌ర్ లో దేవేంద్రి అనే మ‌హిళకి పాము క‌రిస్తే ఆమె భ‌ర్త ఏకంగా పేడ‌గుట్ట కింద ప‌డుకోబెట్టాడు. ఆమె పాము కాటు విషం నుంచి బ‌య‌ట‌ప‌డి బ‌తుకుతుంద‌ని!
మాథ్యూప‌ద‌కండో ఏట జ‌బ్బు చేసి చ‌నిపోయాడు. అత‌ని త‌ల్లి కోరీ మాత్రం ఆకాశం వేపు చూసిన‌పుడ‌ల్లా పోనీ అక్క‌డ‌కి వెళ్లాల‌నే వెళ్లాడ‌నే అనుకుంటోంది. దుఖాన్ని మింగుతూ. పిల్లాడి చితాభ‌స్మాన్ని చంద్రుడి మీద‌కి పంప‌డానికి సిద్ధ‌ప‌డింది కోరి. వ‌చ్చే ఏడాది ఆమె కోరిక ఫ‌లించ‌వ‌చ్చు
ఒక‌రిని అన్న‌పుడు తామూ ప‌డాలిగ‌దా!  బిజెపికీ ఈ సూత్రం వ‌ర్తిస్తుంది. గ‌తంలో మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధా నిగా వున్న‌పుడు ఆయ‌న్ను సోనియా మాట జ‌వ‌దాట‌డ‌ని, కాంగ్రెస్ స్టాంప్ ప్ర‌ధాని అంటూ  తోచిన‌ట్టు కామెంట్లు చేసిన విప‌క్షాల మాట ఇపుడు బిజెపి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి ముర్మీ విష‌యంలో విన‌వ‌స్తుంటే ఇబ్బం దిగా మారింది.
పాల‌న ఎప్పుడూ జ‌న‌రంజ‌కంగా వుండాలి. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ల‌క్ష్యాలూ ప్ర‌జాసంక్షేమాన్ని ఆశించాలి గాని ప్ర‌జ‌ల నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌పుడు మంచి పాల‌న‌ను అందిస్తున్నామ‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేయించుకోవ‌డం న‌వ్వుల‌పాలే అవుతుంది. కేంద్రంలో బిజెపి ప్ర‌భుత్వ గ్రాఫ్‌ ఇప్ప‌టికే ప్ర‌జ‌ల దృష్టిలో ప‌డిపోతోంది. అయినా అగ్నిప‌థ్ వంటి దుర్మార్గ‌పు ఆలోచ‌న‌ల‌తో యువ త‌ను దెబ్బ‌తీయ‌డం కేవ‌లం మూర్ఖ‌పు పాల‌నే అవుతుంది. అస‌లు బిజెపీ పాలిత రాష్ట్రాల్లో ఇలానే ప్ర‌జావ్య‌తిరేక‌త వెల్లువెత్తే ప‌రిస్థి తులే వున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.