పేర్ని నాని కుటుంబం త‌ప్పించుకున్న‌ట్లేనా?

Publish Date:Dec 23, 2024

Advertisement

కాకినాడ పోర్టు కేంద్రంగా రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణాపై గ‌త కొద్దికాలంగా కేసులు, వివాదాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు  కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో రేష‌న్ గోడౌన్ లో రేష‌న్ బియ్యం మాయం కావ‌డంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య జ‌య‌సుధ‌, ఆమె వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిపై పోలీసులు క్రిమిన‌ల్‌ కేసులు న‌మోదు చేశారు. అప్ప‌టి నుంచి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బియ్యం మాయ‌మైన కేసులో ప్ర‌ధాన నిందితురాలు జ‌య‌సుధ విదేశాల‌కు వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశామ‌ని, అదే స‌మ‌యంలో వారిని ప‌ట్టుకునేందుకు మూడు ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని పోలీసులు చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఈ కేసుకు సంబంధించి పేర్ని జ‌య‌సుధ కోర్టులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా, ఆ పిటిషన్ విచారణ మంగళవారం (డిసెంబర్ 24)కువాయిదా ప‌డింది. మ‌రోవైపు పేర్ని నాని, ఆయ‌న కుమారుడు కిట్టులు పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని చెప్పేందుకు పోలీసులు వారింటికి వెళ్లారు. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌టంతో ఈనెల 22న‌ స్టేష‌న్ కు రావాల్సిందిగా ఇంటికి నోటీసులు అంటించారు. అయితే, వారు విచార‌ణ‌కు హాజరు కాక‌పోగా.. పోలీసుల నోటీసులు క్వాష్ చేయాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్లు వేశారు. వారి పిటిష‌న్ల‌పై కూడా మంగ‌ళ‌వారం (డిసెంబర్ 24) కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని త‌న స‌తీమ‌ణి జ‌య‌సుధ పేరిట బంద‌రు మండ‌లం పొట్ల‌పాలెంలో గోదాములు నిర్మించారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాది త‌రువాత‌ ఏపీ గిడ్డంగుల సంస్థ ద్వారా పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ ఆ గోదాముల‌ను అద్దెకు తీసుకుంది. బ‌స్తాకు నెల‌కు ఐదు రూపాయ‌లు  అద్దె చెల్లిస్తోంది. ఆ గోదాముల్లోని నిల్వ‌ల్లో తేడాలున్న‌ట్లు గ‌త నెల‌ చివ‌రి వారంలో పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ‌కు ఫిర్యాదు రావ‌డంతో వారు డిసెంబ‌ర్ నెల మొద‌టి వారంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ప్ర‌భుత్వానికి చెందిన రేష‌న్ బియ్యంలో 185 ట‌న్నులు మాయ‌మైన‌ట్లు కృష్ణా జిల్లా సివిల్ స‌ప్ల‌య్స్ కార్పొరేష‌న్ అధికారులు గుర్తించారు. దీంతో రేష‌న్ బియ్యం మాయంపై బంద‌రు పోలీస్ స్టేష‌న్ లో అధికారులు పేర్ని నాని స‌తీమ‌ణి, గోదాం యాజ‌మాని జ‌య‌సుధ‌తోపాటు ఆమె వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిపైనా ఫిర్యాదు చేశారు. డిసెంబ‌ర్ 10వ తేదీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అంతేకాక రూ.1.76కోట్లు జ‌రిమానా విధించారు. షార్జేజీకి సంబంధించిన రేష‌న్ బియ్యం విలువ ప్ర‌భుత్వానికి చెల్లిస్తామ‌ని  నాని కుటుంబం పేర్కొంది. ఆ మొత్తాన్ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖకు చెల్లించిన‌ట్లు తెలిసింది. అయితే, డ‌బ్బులు చెల్లించినా.. ప్ర‌భుత్వ ఆస్తుల దుర్వినియోగంపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పేర్ని నానికి సంబంధించిన గోదాంలో రేష‌న్ బియ్యం మాయంపై పోలీసులు కేసు న‌మోదు చేసిన నాటి నుంచి ప్ర‌ధాన నిందితురాలు జ‌య‌సుధ‌, ఆమె వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. వీరు ముంద‌స్తుగా పారిపోవ‌డానికి కొంద‌రు పోలీసులు, కృష్ణా జిల్లాకు చెందిన ప‌లువురు తెలుగుదేశం నేత‌లు స‌హ‌క‌రించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబు సైతం సీరియ‌స్ అయ్యార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రోవైపు పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ల‌డంపై వైసీపీ శ్రేణుల్లో  నిరాశ వ్య‌క్త‌మ‌వుతున్నది. గ‌తంలో వైసీపీ హ‌యాంలో కేసులు న‌మోదైన స‌మ‌యంలో తెలుగుదేశం నేత‌లు దైర్యంగా ఎదుర్కొన్నార‌ని.. ప్ర‌స్తుతం వైసీపీ నేత‌లు కేసులు న‌మోదు కావ‌డంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతుండ‌టం ప‌ట్ల వైసీపీ శ్రేణులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో విష‌యం ఏమిటంటే.. ఈ కేసుల నుంచి పేర్ని నాని కుటుంబం సేఫ్ గా బ‌య‌ట‌ప‌డేందుకు వైసీపీ నేత‌ల కంటే కొంద‌రు తెలుగుదేశం వారే  క్కువ ఉత్సాహం చూపుతున్నార‌న్న వాద‌న టీడీపీ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. పోలీసులు సైతం వారిని జాడ తెలిసిన‌ప్ప‌టికీ ప‌ట్టుకొని స్టేష‌న్ కు తీసుకొచ్చి విచార‌ణ జ‌రిపేందుకు వెనుకడుగు వేస్తున్నార‌న్న వాద‌న కూడా ఉంది.

పోలీసుల నోటీసులు క్వాష్ చేయాల‌ని కోరుతూ హైకోర్టులో నాని, ఆయ‌న కుమారుడు కిట్టు పిటిష‌న్లు వేయ‌గా.. కేసులో ఏ1గా ఉన్న నాని స‌తీమ‌ణి జ‌య‌సుధ ఇప్ప‌టికే బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ల‌పై మంగళవారం (డిసెంబర్ 24) కోర్టుల్లో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. కోర్టులు వారికి అనుకూలంగా తీర్పు ఇస్తే .. ఇక వారు అరెస్టు నుంచి త‌ప్పించుకున్న‌ట్లేన‌ని అంటున్నారు. వైసీపీ హ‌యాంలో త‌ప్పు చేయ‌క‌పోయినా అక్ర‌మ కేసులు పెట్టి పోలీసులు తెలుగుదేశం నేత‌ల‌ను జైళ్ల‌కు పంపించిన సంద‌ర్భాలు, పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లి చిత‌క‌బాదిన సంద‌ర్భాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో మాత్రం అందుకు విరుద్ధంగా తప్పు చేసినా కూడా వైసీపీ నేతలను అరెస్టు చేయకుండా వారు తప్పించుకునేందుకు అవకాశాలు ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అవినీతికి పాల్ప‌డినట్లు వైసీపీ నేత‌లు అడ్డంగా దొరికి, కేసులు న‌మోదైనా వారిని ప‌ట్టుకొని చ‌ట్టం ముందు నిల‌బెట్ట‌డంలో పోలీసులు విఫ‌ల‌మ‌వుతుండ‌టం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.