జగన్ పుట్టి ముంచనున్న వివేకా హత్య కేసు?.. కడప ఫలితమే తేల్చేస్తుందా?

Publish Date:Mar 7, 2024

Advertisement

ఏపీలో ఎన్నికలకు నిండా రెండు నెలల సమయం కూడా లేదు.  పొలిటికల్ హీట్స్ రాష్ట్రంలో ఎప్పుడో పీక్స్ కు చేరింది.  విజయం సాధించి అధికారాన్ని చేపట్టేది ఎవరన్న విషయంలో కూడా ఇప్పుడు ప్రజలే కాదు, పొలిటికల్ పార్టీలూ ఓ అంచానకు వచ్చేశాయి. ఒకటి రెండు స్థానాల తేడా తప్ప గెలుపు ఓటముల విషయం ఇప్పటికే అందరికీ అవగతమైపోయింది. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే..

ఏపీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది బహిరంగ రహస్యంగా మారిపోయిన తరుణంలో ఈ ఎన్నికలలో కడప లోక్ సభ స్థానంలో గెలుపు ఒక కేసులో ప్రజాతీర్పు ఎటువైపు ఉందన్న విషయాన్ని కూడా తేల్చేయనుంది. ఆ సీటు కడప లోక్ సభ స్థానం. ఆ స్థానంలో విజయం ద్వారా న్యాయస్థానాల తీర్పులతో పని లేకుండా వివేకా హత్య కేసులో నిందితులు, నేరస్తులు ఎవరు అన్న విషయంలో ప్రజల తీర్పు ఏమిటన్నది కూడా తేలిపోనున్నది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. కారణాలేమైతేనేం అరెస్టు కాకుండా దర్జాగా బయట తిరుగుతున్నారు. ఇక ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తనకు ప్రాణభయం ఉంది మొర్రో అని మొరపెట్టుకుంటున్నారు. భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ కేసులో కీలక నిందితులు తనను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదులూ చేస్తున్నారు.

వివేకా హత్య జరిగిన నాటి నుంచీ ఈ కేసు దర్యాప్తులో అనేకానేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య జరిగిన వెంటనే ఎవరిమీదైతే అప్పటికి విపక్షంలో ఉన్న వైసీపీ అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పించింది. అప్పటి విపక్ష నేత జగన్.. సొంత బాబాయ్ ని పొట్టన పెట్టుకున్నారంటూ శోనక్నాలు పెట్టి ప్రజా సానుభూతిని సంపాదించుకున్నారు. చివరికి ఆ సానుభూతే ఆయనకు అధికార పీఠవ తక్కేలా చేసింది. అయితే  తీరా అధికారంలోకి వచ్చాకా.. ఆరోపణలన్నీ రివర్స్ అయ్యాయి. అప్పట్లో జగన్ అండ్ కో అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లపై వివేకా హత్య వెనుక వారి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన  జగన్ అండ్ కో  ఆ తరువాత అంటే అధకారంలోకి వచ్చిన తరువాత తన ఆరోపణలను చాపచుట్టూసినట్లు చుట్టేసింది. అంతే కాదు విపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్ అండ్ కొ  అధికారం చేతికి వచ్చిన తరువాత స్వయంగా సీబీఐ దర్యాప్తు అవసరం లేదంటూ తన పిటిషన్ ను కూడా ఉపసంహరించుకుంది. ఆ తరువాత వైఎస్ వివేకా కుమార్తె పట్టుదలతో న్యాయం కోసం  సాగించిన అపుపెరుగని పోరాటం ఫలితంగా వివేకా హత్్ కేుసు సీబీఐ చేతికి వెళ్లింది. ఆ దర్యాప్తునకు అడుగడుగునా జగన్ తన అధికారాన్ని ఉపయోగించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై పులివెందులలో దాడి యత్నాలు జరిగాయి. హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడ్డారు. సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు నమోదయ్యాయి. దీంతో మళ్లీ మరోసారి వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించి మరీ కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యేలా చేశారు.

మొత్తంగా ఈ కేసులో  సీబీఐ దర్యాప్తులో భాగంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులెవరన్న విషయంలో జన బాహుళ్యంలో ఒక స్పష్టత వచ్చింది. ఇంటి దొంగలే వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్నారన్న అనుమానాలు నిరాధారమైనవేమీ కావన్న స్పష్టత వచ్చింది.    కడప లోక్ సభ అభ్యర్థి విషయంలో వచ్చిన విభేదాలే వివేకా హత్యకు మోటివ్ గా సీబీఐ దర్యాప్తు తేల్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సొంత కుటుంబ సభ్యులే దూరమయ్యారు. వివేకా కుమార్తె సునీత కూడా తన అన్న అధికారంలో ఉండగా తన తండ్రి హత్య కేసు తేలే అవకాశాలు లేవన్న నిర్ధారణకు వచ్చారు. అందుకే అన్నకు వ్యతిరేకంగా హస్తిన వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పార్టీకి ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ణప్తి చేశారు.  

ఇప్పటికే ఎన్నో మలుపులు, అంతకి మించి కుదుపులు చోటు చేసుకున్న వివేకా హత్యకేసులో ప్రజా తీర్పు ఏమిటన్నది ఎన్నికలలో కడప లోక్ సభ నియోజకవర్గ ఫలితం తేల్చేస్తుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించి ప్రజల మద్దతు కోరాలని నిర్ణయించుకున్నారు. దీంతో వివేకా హత్య కేసు క్లైమాక్స్ కు వచ్చేసినట్లూనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలలో వివేకా హత్యకేసు కూడా ఒకటి .. ఇప్పుడు అదే హత్యకేసు అధికార వైసీపీ పుట్టి ముంచుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.  రాజకోట లాంటి ఇంట్లో అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను వారికి తగ్గట్లుగా మలుచుకున్న జగన్, ఆయన పార్టీకి ఇప్పుడు అదే హత్య కేసు రివర్స్ లో చుట్టుకుంది.   అప్పుడు వైసీపీ ఈ కేసును ఏ స్థాయిలో ఎన్నికల సమరంలో సానుభూతిని ఏరులై పారించిందో.. ఇప్పుడు  రివర్స్ లో జగన్, ఆయన పార్టీని  కోలుకోలేని విధంగా దెబ్బతీయబోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

నిజానికి ఈ హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేది కోర్టులు, శిక్షలకే పరిమితం. కానీ, రాజకీయాలలో చేసే ఆరోపణలలో బలం ఎటువైపు ఉంటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు ఐదేళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలు అన్నీ కూడా  వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అందులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నాన్న కొడుకైన ఎంపీ అవినాష్ ఈ కేసులో కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే తేల్చి చెప్పడం సీఎం జగన్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీయనున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, ఈ కేసులో అవినాష్ కాపాడేందుకు జగన్ తన సర్వశక్తులూ ఒడ్డడాన్ని జనం గమనించారని అంటున్నారు.    అందుకే నాడు జగన్ కు జనం సానుభూతిని తెచ్చిపెట్టిన వివేకా హత్య కేసే ఇప్పుడు ఆయనపై జనాగ్రహం అస్త్రంలా దూసుకు రావడానికి కారణమౌతుందంటున్నారు. 

By
en-us Political News

  
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.