ప్రభంజనం.. దద్దోజనం!

Publish Date:Nov 9, 2023

Advertisement

తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అన్నాడో సినీ కవి. కానీ రాష్ట్ర విభజన అనంతరం తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనదని అందామన్నా.. అనుకుందామన్నా మనస్సు మాత్రం ఒప్పుకోవడం లేదని  తెలుగు సమాజ హితాన్ని కాంక్షించే పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచానికి కరోనా వైరస్ పట్టి పీడించి రెండేళ్ల పాటు దశల వారిగా కొన్ని కోట్ల మంది జీవితాలను పుట్టి ముంచితే.. తెలుగు జాతికి మాత్రం ఏం తెగులు పుట్టిందో ఏమో కానీ పోరాట పటిమను మరిచిపోయిందనే ఓ సంశయాన్ని సైతం వారు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాగాణి భూముల్లో ధాన్యం రాశులు, నీటి ప్రాజెక్టుల్లో జల సిరులతో.. ఇంకా చెప్పాలంటే.. అష్టలక్ష్ములు తమ రెండు హస్తాల్లో నిండు కుండలతో కళ కళలాడుతోండేవని.. కానీ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత.. ఈ తెలుగు రాష్ట్రాలపై జేష్ట్యాదేవి చూపు సోకి.. దరిద్రానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయని.. దీంతో అభివృద్ధి అనేది లేక ఆయా రాష్ట్రాలు అధ:పాతాళంలోకి జారి పోయాయనీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. రేపో మాపో ఆ సంస్థ  ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఈ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. విశాఖ వేదికగా చేపట్టిన.. ఆందోళనలు, నిరసనలు నవంబర్ 8 తేదీతో వెయ్యి రోజులు పూర్తి చేసుకొన్నాయి. విశాఖ ఉక్కు - ఆంధ్రల హక్కు అనే నినాదంతో 32 మంది ఆత్మ బలిదానాలతో తెచ్చుకొన్న ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ ఎంతో మంది జీవితాలతో పెన వేసుకొని పోయిందని.. ఇంకా చెప్పాలంటే.. తెలుగు వాడి సంకల్పం ఉక్కు అని ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా దేశానికి తేటతెల్లమైందని.. అలాంటి సంస్థను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం కానీ.. ప్రజా ప్రతినిధులు కానీ ఏ మాత్రం ఊలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడాన్ని చూస్తేంటే.. వాళ్లని చూసి ప్రజలు సిగ్గుపడాలా? లేకుంటే.. మన నాయకులు ఇలాంటి వాళ్లని తలదించుకోవాలా?  అర్థం కాకుండా ఉందనే వారు పేర్కొంటున్నారు.    

ఇక రాష్ట్ర విభజన జరిగి మరికొద్ది రోజులకు దశాబ్దం పూర్తి కావొస్తోందని... విభజన బిల్లులో పొందుపరిచిన అన్ని హామీలు అమలు అయ్యాయా.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిందా? రాష్ట్రానికి రాజధాని లేక.. పరిశ్రమలు రాక.. ఉద్యోగాలు లేక.. రాష్ట్రవ్యాప్తంగా గాండాంధకారం అలుముకోవడంతో.. తాను బతకడం కోసం.. తమ వారిని బతికించకోవడం కోసం నిలువెత్తు నిటారుతో కదులుతోన్న వెన్నుముక జీవులు ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టారు.. పడుతున్నారు.

ఇక విడిపోయి.. వెలిగిపోతామంటూ తెచ్చుకొన్న తెలంగాణ   రాష్ట్రం సైతం అన్ని విధాలా పాలన చేతకానీ పాలకులతో నిండా మునిపోయింది. ధనిక రాష్ట్రం.. ధనిక రాష్ట్రం అంటూ జబ్బలు చరుచుకొన్న నేతలు.. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేళ.. తెలంగాణను అప్పుల ఊబిలో  నిలువునా ముంచేశారని తెలుగు సమాజ హితాన్ని కాంక్షించే వారు సోదాహరణగా వివరిస్తున్నారు.  

తెలుగు రాష్ట్రాల్లో అధికారమనే అందలమెక్కిన పాలకులు.. ప్రజా క్షేమం కోసం పాటు పడకుండా.. ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో.. వారు కట్టిన పన్నులనే వారికి పైసల రూపంలో విదిల్చి.. కుర్చి ఎక్కిన ఎలికలు మాత్రం ప్రజల పన్నులతో సర్వ భోగాలను అనుభవిస్తున్నారు. పాలకులు చేస్తున్న.. చేయిస్తున్న అరాచకాలు, అక్రమాలన్నీ తెలిసినా ప్రజలు మాత్రం.. ప్రశ్నించే గుణాన్ని కోల్పోయి.. పాలకుల దయా.. మన ప్రాప్తం అన్న చందంగా మసులుకొవడం చూస్తుంటే.. ప్రభంజనంలా ఉవ్వెత్తున ఎగసిపడాల్సిన జనం.. దద్దోజనంలాగా ముద్దగా ఇంకా చెప్పాలంటే అన్ని అవయువాలు దివ్యంగా పని చేస్తూ కూడా దివ్యాంగుల్లా ఉండిపోతున్నారనే అభిప్రాయం సైతం సదరు ప్రముఖుల్లో వ్యక్తమవుతోంది. 

గతంలో తమకు అన్యాయం జరిగితే.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పది పైసలు పెంచినా, కరెంట్ చార్జీలు పెంచినా.. రాష్ట్రంలో ఏ మారు మూల ప్రాంతంలో అత్యాచారం జరిగినా.. పాలకుల అవినీతి అక్రమాలు బహిర్గతమైనా... ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు, పార్టీల శ్రేణులు, ప్రజా సంఘాలు, సమాజ హితం కాంక్షించే వారు రోడ్ల పైకి దూసుకొచ్చి.. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు తమదైన శైలిలో చేసి.. వారి నిరసనను ప్రభుత్వాలకు తెలిపేవారు. కానీ నేడు ఆ పరిస్థితి.. భూతద్దం పెట్టి వెతికినా.. ఎక్కడా కానరావడం లేదని వారు వాపోతున్నారు. తెలుగు ప్రజల్లో గతంలో ఉన్న ఉక్కు సంకల్పం కాస్తా..  తుక్కు సంకల్పమైపోయిందని.. దీంతో ప్రశ్నించడం, పోరాడడం వంటి గుణాల్ని వారు కోల్పోయారని.. తెలుగు సమాజ హితాన్ని కాంక్షించే వారు వివరిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.