జగన్ పై జనాగ్రహమే.. ఆ హీరోలను దెబ్బేసిందా?

Publish Date:May 5, 2022

Advertisement

ముగ్గురు హీరోలు..మూడు సినిమాలు.. ముగ్గురూ మామూలు హీరోలు కాదు. అశేష్ అభిమాన గణం వారి సొంతం. ఒకరు మెగా హీరో,మరొకరు సూపర్ స్టార్, ఇంకొకరు పాన్ ఇండియా స్టార్. కరోనా విజృంభణ కారణంగా ఏళ్ల తరబడి వీళ్ల  సినిమాల కోసం ఆయా హీరోల అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణ అలా కొనసాగుతుండగానే.. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వివాదం తెరమీదకు వచ్చింది. వినోదం పేదలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ ఏపీలో సినిమా టికెట్లను భారీగా తగ్గించేస్తూ జగన్ సర్కార్ నిర్ణయించింది. వెంటనే అమలులోనికి తీసుకువచ్చేసింది. జగన్ ఈ హఠాత్ నిర్ణయం వెనుక  రాజకీయ నాయకుడిగా క్రియాశీలంగా ఉండి ఏపీ సర్కార్ ను విమర్శలతో దనుమాడుతున్న పవన్ కల్యాణ్ సినిమాను, విపక్ష పార్టీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ సినిమాను దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే జగన్ సర్కార్ టికెట్ల వివాదాన్ని తీసుకువచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని వేటినీ లెక్క చేయకుండా జగన్ తన నిర్ణయంతో మొండిగా నిలబడిపోయారు. 

సరిగ్గా ఈ సమయంలోనే సినీ పరిశ్రమ టికెట్ల విషయంలో ఏపీ సర్కార్ తో రాయబారాలు నడిపింది. మొత్తబడినట్లు కనిపించిన జగన్ ఆయన లక్ష్యం అని అందరూ అనుకుంటున్న రెండు సినిమాలూ అంటే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయర్, బాలకృష్ణా హీరోగా నటించిన అఖండ సినిమాలు విడుదలయ్యే వరకూ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ లోగా మెగా హీరో చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబులు జగన్ తో బేటీ అయ్యారు. 

ఏపీలో సినిమా టికెట్లపై పునరాలోచించాలని కోరారు. అందుకు జగన్ అంగీకరించేశారు. టికెట్ల విషయంలో జగన్ తన నిర్ణయం మార్చుకోవడానికి భీమ్లానాయక్, అఖండ సినిమాలు విడుదలయ్యే వరకూ వేచి చూశారు. ఆ తరువాత టికెట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ తరువాత జగన్ ను కలిసిన ముగ్గురు హీరోలలో ఇద్దరు హీరోల సినిమాలు విడుదలయ్యాయి. అ రెండూ బాక్సాఫీస్ వద్ద ఫట్ మన్నాయి. ఇండస్ట్రీ డిజాస్టర్ గా నిలిచాయి. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, మెగాస్టార్ నటించిన మెగా మూవీ ఆచార్యలు ప్లాప్ అయ్యాయి. ఆ స్థాయి హీరోల సినిమాలు ఇంతటి డిజాస్టర్ కావడం అన్నది సాధారణంగా జరగదు. ఓపెనింగ్స్ లోనే సాధారణంగా బయ్యర్లు, నిర్మాతలూ ఒడ్కెక్కేస్తారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ రెండు సినిమాలూ కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయాయి. 

ఈ రెండు సినిమాల వైఫల్యానికి సినిమా బాగోగులు కాకుండా మరో కారణం ఉందంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. జగన్ పై ఉన్న జనాగ్రహమే ఈ హీరోల సినిమాలు ప్లాప్ కావడానికి కారణమైందని అంటున్నారు. ఒక వైపు పవన్ కల్యాణ్, బాలకృష్ణ వెన్నెముక నిటారుగా ఉంచుకుని జగన్ ఉద్దేశ పూర్వకంగా తీసుకువచ్చిన టికెట్ల వివాదాన్ని ఎదుర్కొంటే...చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు మాత్రం అమరావతి వెళ్లి జగన్ ను కలిసి బతిమలాడుకోవడం జనానికే కాదు, ఆ హీరోల ఫ్యాన్స్ కు కూడా రుచించలేదని, అందుకే వారు వారి సినిమాలను చూడటానికి ఇష్టపడలేదనీ అంటున్నారు. మరి కొద్ది రోజులలో మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట విడుదల కావలసి ఉంది. ఆ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ సినీ వర్గాలలో నెలకొని ఉంది.  

By
en-us Political News

  
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.