విశాఖ వారాహి యాత్రలో పొత్తు పొడుపులపై కొత్త చర్చకు తెర లేపిన పవన్ ప్రసంగం

Publish Date:Aug 11, 2023

Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో అధికార వైసీపీ అవినీతి, అక్రమాలు, ఆర్థిక అరాచకత్వంపై విమర్శలు గుప్పించారు. వారాహి మూడో విడత యాత్రలో భాగంగా ఆయన విశాఖలో జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. వాలంటీర్ వ్యవస్థపై తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఏపీ ప్రజల డేటా అంతా హైదరాబాద్ కు చేరుతోందన్నారు.

వలంటీర్లపై తనకేం ఆగ్రహం లేదంటూనే  వలంటీర్ల వ్యవస్థ ఎంత దుర్మార్గమైనదో వివరించారు. ఇక్కడి వరకూ అంతా బానే ఉంది.. కానీ ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ పై అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించడం, తాను చెబితే చాలు జగన్ అక్రమాలకు, అన్యాయాలకు, అరాచకత్వానికి మోడీ సర్కార్ చరమ గీతం పాడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయడంపైనే పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  ఇన్నేళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉండి ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టికి రాష్ట్రంలో సాగుతున్న దుష్టపాలన గురించి పవన్ కల్యాణ్ తీసుకువెళ్లలేదా అని ప్రశ్నిస్తున్నారు. తీసుకువెళ్లినా మోడీ అండ్ కో పెడచెవిన పెట్టారా, పట్టించుకోలేదా? లేక కేంద్రంలో మోడీ సర్కార్ కు రహస్య మిత్రుడిగా.. కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ చెప్పినట్లు మోడీకి పుత్ర సమానుడైన జగన్  రాష్ట్రంలో సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన గురించి చెప్పడానికి జనసేనాని సంకోచించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే దానిని  పక్కన పెడితే 

వారాహి మూడవ విడత యాత్ర విశాఖలో ఆరంభమైంది. ఊహించినట్లే.. జనసేనాని  జగన్ టార్గెట్ గా  నిప్పులు చెరిగారు. సవాళ్లు విసిరారు. హెచ్చరికలూ చేశారు.   విశాఖలోని జగదాంబా సెంటర్ వద్ద జరిగిన భారీ సభలో పవన్ కల్యాణ్.. జగన్ మీద విమర్శల దాడి స్థాయిని పెంచారు. ఇన్నాళ్ళూ  విమర్శలు మాత్రమే చేస్తూ వస్తున్న పవన్ ఈసారి కార్యాచరణకు దిగుతానని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద వైసీపీ అవినీతి చిట్టా ఉందని ఇక జగన్ కు చుక్కలేనని ప్రకటించారు. 

కేంద్ర హోం మంత్రి విశాఖ వచ్చి వైసీపీ ప్రభుత్వ అవినీతి గురించి చెప్పారని  తాను కూడా కేంద్రం సాయంతో జగన్ కట్టిస్తానన్నారు.  వైసీపీ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేస్తోందనీ, అందుకు సంబంధించిన ఫైల్ కేంద్రం దగ్గర ఉందని పవన్ చెప్పుకొచ్చారు. ఇలా మైనింగ్ అక్రమంగా చేస్తున్న ఎమ్మెల్యేల చిట్టా కూడా కేంద్రం వద్ద ఉందన్న కొత్త విషయాన్ని కూడా బయటపెట్టారు. విశాఖ జిల్లాలోనే మైనింగ్ కుంభకోణాలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే కేంద్రం ఇచ్చిన నిధులతో పనులు చేస్తూ దానికి జగన్ తన సొంత బొమ్మ వేసుకుంటున్నారు అని విమర్శించారు. విశాఖలో పాతిక వేల కోట్ల విలువ చేసే ఆస్తులను తాకట్టు పెట్టింది వైసీపీ ప్రభుత్వం అని పవన్ ఆరోపించారు

ఇక దేశంలోనే పేరెన్నిక కలిగిన ఆంధ్ర యూనివర్సటీ పూర్తిగా భ్రష్టు పట్టి ర్యాంకులు లేక దిగజారిపోయిందనీ,  ఏకంగా క్యాంపస్ లో సెక్యూరిటీయే గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనీ ఆరోపించారు. ఏయూ వీసీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయాలని గ్యాడ్యుయేట్లపై ఒత్తిడి తేవడం వ్యవస్థల దిగజారుడుకు నిలువెత్తునిదర్శనంగా పవన్ అభివర్ణించారు. 

ఈ విమర్శలలో కొత్తవేమీ లేకపోయినా.. పవన్ కల్యాణ్ స్వరంలో వాడీ వేడి పెరిగి నిప్పుల బాణాల్లో ఆయన మాటలు దూసుకు వచ్చాయి. అలాగే ఇప్పటి వరకూ  ఎక్కడా ఆయన అధికారంలోకి వచ్చాకా అన్న మాట అనలేదు. రాష్ట్రంలో జగన్  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని ఇంత కాలం చెబుతూ వచ్చిన పవన్ విశాఖలో తొలి సారిగా జనసేన అధికారం గురించి మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటే సరిపోదనీ, మీరు కూడా అంటే జనం కూడా కోరుకోవాలని పిలుపు నిచ్చారు.

జనసేన అధికారంలోకి వచ్చాకా.. ఆంధ్రా యూనివర్సిటీని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని చెప్పడం ద్వారా రాష్ట్రంలో పొత్తు పొడుపులకు సంబంధించి కొత్త చర్చకు ఆయన తెరలేపారు.  జగన్ని ఏకంగా వ్యాపారిగా అభివర్ణించారు. ఆయన వద్దకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే యువతకు ఉద్యోగాలు  అడగడం మాని.. తనకు ఎంత కమిషన్ అని అడుగుతారని తీవ్ర ఆరోపణలు చేశారు.  

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.