ముంబైలో పవన్ కల్యాణ్ భుజాలకు సర్జరీ.. ఎప్పుడంటే?
Publish Date:Jul 10, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ జరగనుంది. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ తీవ్రమైన భుజాల నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే.. ఆయనకు ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు అత్యవసరంగా సర్జరీ చేయించుకోవాలని సూచించారు. జూన్ నెలాఖరులోనే ఆయన తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబై వెళ్లి సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కల్యాణ్ కు వైద్యులు.. రెండు భుజాల రొటేటర్ కఫ్ దెబ్బతిందని చెప్పారు. అలాగే రెండు ప్రధాన భుజాల కండరాలు పూర్తిగా చిట్లిపోయాయనీ పరీక్షల్లోతేలినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి తీవ్రతను బట్టి వెంటనే శస్త్రచికిత్స అవసరమని అప్పుడే చెప్పారు. అందరూ కూడా పవన్ కల్యాణ్ సర్జరీ తరువాతే ముంబై నుంచి తిరిగి వస్తారని అప్పట్లో భావించారు. అయితే.. రాష్ట్రంలో ఉన్న ముందస్తు పాలనా బాధ్యతలు, కీలకమైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే సర్జరీ చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకుచెప్పారు. ఇప్పుడు ఆయన తీరిక చేసుకుని భుజాలకు సర్జరీ చేయించుకోవడానిక మంబై బయలుదేరారు. తాజా సమాచారం మేరకు.. శనివారం (జూలై 11) పవన్ కు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో మొదటి విడత సర్జరీ జరుగుతుంది. ఆ తర్వాత కొద్ది రోజుల విరామం ఇచ్చి, పరిస్థితిని బట్టి రెండో భుజానికి కూడా వౌద్యులు సర్జరీ చేస్తారు. ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రజా ప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలకు తాను నెల రోజుల పాటు అందుబాటులో ఉండననీ, ఆ సమయంలో పార్టీ ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, , క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. Pawan Kalyan to undergo shoulder surgery in Mumbai, Shoulders Injury, Gabbarsingh Moovie, kokila Dhirubhai Ambani, Hospital
http://www.teluguone.com/news/content/pawan-kalyan-to-undergo-shoulder-surgery-in-mumbai-25-225646.html





