పొత్తు ఖాయం.. సీఎం ఆయనే.. కుండబద్దలు కొట్టిన పవన్

Publish Date:May 11, 2023

Advertisement

జనసేనాని గుప్పెట విప్పేశారు. పొత్తులు ఉంటాయని కుండ బద్దలు కొట్టేశారు. అదే సమయంలో తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేననీ, ఆ పోస్టు కోసం వెంపర్లాడబోననీ కూడా తేటతెల్లం చేసేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్  అవినీతి పాలన అంతమొందించడమే లక్ష్యమని మొదటి నుంచీ చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కండా ఉండేందుకు తన వంత ప్రయత్నం, కృషి చేస్తానని గతంలోనే ప్రకటించారు.

ఏపీలో  బలం ఉన్న, బలంగా ఉన్న పార్టీలు మూడే మూడు. అవి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, అధికార పార్టీ వైసీపీ, జనసేన. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించిన రోజునే.. ఆయన తెలుగుదేశంతో పొత్తు ఉంటుందన్న సంకేతాలిచ్చారని అందరికీ తేటతెల్లమైపోయింది. బీజేపీని కూడా  ఒప్పిస్తాననీ, ఆ పార్టీకి యిప్పటికే మిత్రపక్షమైన జనసేన క్లియర్ గా చెప్పింది. దీంతో ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా 2014 ఎన్నికల నాటి పొత్తులు మళ్లీ పొడుస్తాయని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. అయితే నరం లేని నాలుక నానా విధాలుగా మాట్లాడుతుందన్నట్లు కొందరు సామాజికవర్గం పేరు చెప్పి సీఎం పదవి విషయంలో  చేసిన వ్యాఖ్యలో  కొంత గందరగోళాన్ని సృష్టించాయి.

దానిని పునాదిగా చేసుకుని అధికార వైసీపీ కూడా సింహం సింగిల్ గా వస్తుంది వంటి పంచ్ డైలాగులతో పొత్తలపై విమర్శల వర్షం కురిపించింది. అన్నిటికీ మించి జనసేన పార్టీలో కొత్తగా కార్యదర్శి పదవి పొందిన జనసేనాని సోదరుడు తాజాగా చేసిన వ్యాఖ్యలతో సానుకూల వాతావరణం చెడుతుందా అన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పొత్తులు, ముఖ్యమంత్రి పదవి వంటి అంశాలపై స్పష్టతనిచ్చారు.  వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయంగా పెట్టుకుంటున్నామని ప్రకటించారు. సీఎం పదవి విషయంలో జరుగుతున్న ప్రచారానికి కూడా తెర దించే శారు.    తాను సీఎం పదవిని అడగబోనని కుండబద్దలు కొట్టేశారు.

ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని ఢీకొని కూలదోయడానికి జరిగే ప్రయత్నంలో షరతులు పెట్టే ప్రశక్తే లేదని తేల్చేశారు.  ప్రజలు కావాలని కోరుకుంటే సీఎం అవుతానన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు జనం  30 స్థానాలు ఇచ్చి ఉంటే యిప్పుడు తాను సీఎం రేసులో ఉండేవాడినని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికలలో తాను సీఎం రేసులో లేనని విస్పష్టంగా తేల్చేశారు.  జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాలలో 30శాతం ఓటింగ్ ఉందన్నరు. అందుకు అనుగుణంగానే జనసేనకు ఉన్న బలం మేరకే పొత్తులో భాగంగా సీట్లు కోరుతానని పవన్ కల్యాణ్ చెప్పేశారు.  

పొత్తుల విషయంలో తన స్టాండ్ మారలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా పొత్తులతోనే బలపడ్డాయని గుర్తు చేశారు. ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో తాను వచ్చే నెల 3వ తేదీ నుంచీ ఏపీలోనే ఉంటానని చెప్పిన జనసేనాని..  పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని తాను ఒప్పిస్తానని చెప్పారు. ఇదే విషయం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కూడా మాట్లాడారు.  బీజేపీ కూడా కలిసి రావాలని ఢిల్లీలో పవన్ చర్చలు జరిపినట్లుచెబుతున్నారు.

ఒక వేళ బీజేపీ రాకపోతే.. టీడీపీతో కలిసి వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారని ఆయన తాజా వ్యాఖ్యలతో నిర్ధారణ అయిపోయిందనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సీఎం పదవి విషయంలో తమ క్యాడర్ చేస్తున్న వ్యాఖ్యలతో పొత్తు అంశం ముందుకు సాగకుండా అడ్డం పడకుండా ఆదిలోనే చెక్ పెట్టేశారు. పవన్ తాజా వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది స్పష్టమైపోయిందని  పరిశీలకులు చెబుతున్నారు.  

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.