లోకేష్ ను కరెక్ట్ చేసిన పవన్ కల్యాణ్.. ఏ విషయంలోనో తెలుసా?

Publish Date:Apr 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అత్యంత సమన్వయంతో సాగుతోంది. మరో పదిహేనేళ్ల పాటు కూటమి పటిష్ఠంగా ఉంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అక్కడక్కడా తలెత్తుతున్న విభేదాలను భూతద్దంలో చూపుతూ ప్రత్యర్థి పార్టీ కూటమి విచ్ఛిన్నం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు.    ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.  

  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో   నారా లోకేష్ గురువారం (ఏప్రిల్ 16) ముఖాముఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా  పవన్ కల్యాణ్ తనను ఎలా కరెక్ట్ చేశారో వివరించారు. అదేలా అంటే.. గతంలో   ఒక సదస్సులో   2029లో మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు తాను క్షణం కూడా ఆలోచించకుండా నిస్సందేహంగ తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే 2029లో కూడా అధికారంలోకి వస్తుందని జవాబిచ్చినట్లు లోకేష్ చెప్పారు.  

అయితే  మరుసటి రోజే తనకు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి 2029లో అధికారంలోకి వస్తుందని ఎందుకు చెప్పారు. మనం వరుసగా మూడుసార్ల అధికారంలో కొనసాగుతామని చెప్పాలి కదా అని కరెక్ట్ చేశారని లోకేష్ వివరించారు.  ఆ సంకల్పంతోనే మనం జనంలోకి వెళ్లాలని జనసేనాని చెప్పారని లోకేష్ వివరించారు.  ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా చెప్పడం.. ఆ ఇరువురి నేతల మధ్య బంధాన్ని, పరస్పరం ఉన్న సోదర భావాన్ని తెలియజేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. 

ఈ ఫోన్ కాల్  పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య ఉన్నఅనుబంధాన్ని, అలాగే కూటమి ఐక్యతనూ మరోసారి ప్రస్ఫుటం చేసిందన్న చర్చ రాజకీయవర్గాలలో సాగుతోంది.   తెలుగుదేశం కూటమి కేవలం పార్టీల మధ్య పొత్తుకే పరిమితం కాలేదనీ, ఆయా పార్టీల నేతల మధ్య కూడా  వ్యక్తిగత స్థాయిలో కూడా పటిష్ఠ మైన బంధంగా ఉందనీ తేటతెల్లమౌతోంది.  

 లోకేష్‌కు పవన్ స్వయంగా ఫోన్ చేసి సలహాలు ఇవ్వడం, పవన్‌ను లోకేష్ తన అన్నలా భావిస్తూ ఆ సూచనలను స్వీకరించడం రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిత్రధర్మానికి, పొత్తు ధర్మానికి సరైన మోడల్ గా అభివర్ణిస్తున్నారు.   అధికార కూటమి పార్టీలకు చెందిన కీలక, అగ్రనేతలు ఏకతాటిపై ఉండటం పాలనపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందనీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతోందనీ అంటున్నారు.  

రానున్న రోజుల్లో కూటమిలోని పార్టీల మధ్య మరింత సమన్వయం పెరిగేలా ఈ ఇరువునూ ముందుకు సాగుతున్న తీరు పట్ల తెలుగుదేశం, జనసేన క్యాడర్ లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.  కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలు   తాత్కాలికం కావని, సుదీర్ఘ ప్రయాణానికి పునాదులని ఈ ఇరువురూ విస్పష్టంగా చాటుతున్నారు. 

By
en-us Political News

  
జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు. బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయంగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.