భారత్ తో కాళ్లబేరానికి పాకిస్థాన్.. ఎందుకంటే?

Publish Date:Jan 25, 2023

Advertisement

భారత్‌తో మూడు ప్రత్యక్ష యుద్ధాలు, అనే  పరోక్ష యుద్ధాలు చేసిన పాకిస్థాన్‌  ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తోంది.   బుద్ధి వచ్చిందని,   అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఇటీవల పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహజా షరీఫ్‌ ఓ ప్రకటన చేశారు.  భారత్‌ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని  ప్రకటించారు. ఆయన ప్రకటనలో  నిస్సహాయత ఉంది. అదినిజం. అలాగే కపటత్వమూ ఉంది. అదీ వాస్తవమే.  కాశ్మీర్‌తో సహా వివిధ కీలక సమస్యల మీద ‘నిజాయతీ’గా చర్చలు జరిపి, వీటికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని   షరీఫ్‌ అంటున్నారు.  

అదే పాకిస్థాన్ లోని కపటత్వాన్ని ప్రపంచానికి మరో సారి ఎత్తి చూపింది. కాశ్మీర్‌ మీద చర్చించడానికి ఏమీ లేదు. కాశ్మీర్‌ భారత్‌లోని భాగమని, ఆర్టికల్‌ 370 రద్దుతో ఇది మరింత ధృవపడింది. కాశ్మీర్‌ మొదటి నుంచి భారతదేశంలో అంతర్భాగమనీ ఆర్టికల్‌ 370 రద్దు కూడా భారతదేశ అంతరంగిక వ్యవహారమని పాక్ ప్రపకటన శాంతి చర్చల ప్రతిపాదన ప్రకటనలో అంగీకరించి ఉంటే.. ఆ దేశంలో మార్పు వచ్చిందనీ, వస్తోందనీ ఒకింత విశ్వాసం  కలిగేది. కానీ ఆయనా పని చేయలేదు. పాకిస్థాన్ విషయంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవలసిన అంశాలు ఉన్నాయన్నపాత పాటనే ఆయన పాడారు. అన్నిటికీ మించి భారత్ లో అశాంతి నింపడం, శాంతి భద్రతల సమస్య సృష్టించడం, మారణహోమం సృష్టించి అస్థిరత నెలకొల్పడం లక్ష్యంగా పాక్ భూభాగంలో శిక్షణ పొంది దొంగచాటుగా సరిహద్దులు దాటి వస్తున్న ఉగ్ర చొరబాట్ల గురించి ఆయన శాంతి చర్చల ప్రతిపాదన ప్రకటనలో ప్రస్తావించలేదు.  

ఎందుకంటే వాస్తవంగా  ఈ విషయాలేవీ  ఆయన చేతుల్లో లేవు. ఆయన నియంత్రించలేరు.   కాశ్మీర్‌ సమస్యను రావణ కాష్టం లాగా మార్చడంపైనా అక్కడి సైనికాధికారుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాశ్మీర్ కారణంగానే దేశంలో వారి పెత్తనం కొనసాగుతోంది. అందుకే భారత్ పాక్ ప్రతిపాదనకు స్పందించలేదు.   భారత్ తో చర్చలకు ప్రయత్నాలు చేయడం కంటే తమ అంతర్గత సమస్యలను పరిష్కరించు కోవడం మీద దృష్టి కేంద్రీకరించడం మేలని అన్యాపదేశంగానైనా పాక్ ప్రధానికి భారత్ విస్పష్టంగా చెప్పింది.    భారత్‌ ఇప్పటికే పాకిస్థాన్‌తో చర్చలకు ససేమిరా  అని తేల్చి చెప్పేసింది.   అయితే పాక్ బేలగా భారత్ను బతిమలాడుకోవడానికి కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. గోధుమ పిండి  కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

ఇదివరకటి మాదిరిగా యూరోపియన్‌ దేశాల నుంచి ఆ దేశానికి   ఎగుమతులూ జరగడం లేదు.   ఏవిధమైన సహాయమూ అందడం లేదు. అమెరికా నుంచి కూడా చాలా చాలా పరిమిత స్థాయిలోనే   విదేశీ మారక నిల్వలు దాదాపు అడుగంటి పోయాయి. దీంతో ఇక రానున్నరోజులలో దిగుమతులు కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది.  దేశంలో వ్యవసాయ రంగం   కుదేలైపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 60 శాతం, అంతకు మించి పెరిగిపోయాయి. 

చైనా, యు.ఏ.ఇ, సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలు పాకిస్థాను సహాయం చేయడానికి ముందుకు వచ్చినా తక్షణసమస్యల నుంచి గట్టెక్కే అవకాశం లేదు.   ఆఫ్ఘనిస్థాన్‌ చెందిన తాలిబన్లతో పాకిస్థాన్‌ సంబంధాలు పూర్తిగా దెబ్బతిని పోయాయి. ఈ పరిస్థితుల్లో పాక్ కు భారత్ సహకారమే దిక్కు. అందుకే పాకిస్థాన్ ఇంత బేలగా భారత్ తో శాంతి చర్చల కోసం పాకులాడుతోంది. బతిమలాడుకుంటోంది.  

By
en-us Political News

  
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.