మసూద్ అజహర్ కు పాక్ భారీ నష్టపరిహారం.. పాక్ టెర్రర్ లింక్ కు ఇంతకంటే రుజువేంటి?

Publish Date:May 14, 2025

Advertisement

పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదానికి ఉన్న నెక్సస్ ప్రతి సందర్బంలోనూ బయటపడుతూనే ఉందిద. భారత్ లో జరిగిన ప్రతి ఉగ్రదాడిలోనూ ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర సంస్థల ప్రమేయం, వాటికి పాకిస్థాన్ ప్రభుత్వ, సైన్యం సహాయ సహకారాలు మద్దతు ఉన్నట్లు పదేపదే రుజువైంది. అయితే ప్రతి సందర్భంలోనూ పాకిస్థాన్ ఉగ్రదాడులతో సంబంధం లేదని బుకాయిస్తూనే వస్తోంది. తాజాగా పహల్గాం ఉగ్రదాడిలో కూడా పాక్ హస్తం ఉందన్న విషయం నిర్ధారణ అయ్యింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాక్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలను  ధ్వంసం చేసింది. ఆ సందర్భంగా దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తరువాత ఇరు దేశాల మధ్యా కొన్ని రోజుల పాటు అప్రకటిత యుద్ధం కొనసాగింది. ఆ సందర్భంగా కూడా పాకిస్థాన్ కు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు చేతులెత్తేసింది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం బతిమలాడుకుంది. సరే ఇరు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకారించాయి. 

అయితే ఇక్కడే పాక్ తన కుత్సితబుద్ధిని మరో సారి బయటపడింది. ఉగ్రవాదులతో సంబంధం లేదనీ, ఉగ్రవాదాన్నితాము ప్రోత్సహించడం లేదనీ, తామూ ఉగ్రబాధితులమేననీ బుకాయిస్తూ వస్తున్న పాక్  తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. పాక్ భూభాగంలోని 9 ఉగ్ర సంస్థలను భారత్ ధ్వంసం చేసిన సందర్భంగా మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు పాకిస్థాన్ ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అలా పాక్ ప్రకటించిన నష్టపరిహారం అందుకునే వారిలో అంతర్జాతీయ ఉగ్రవాది, నిషేధిత  జైషే అహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజహర్ కూడా ఉన్నాడు. బహావల్పూర్ ప్రాంతంలో భారత్ జరిపిన దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు 14 మంది మరణించారు. వారందరికీ వారసుడు మసూద్ అజహారే. దీంతో పాక్ ప్రభుత్వం ఆయనకు 14 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించబోతున్నది. నిజంగా పాకిస్థాన్ కు ఉగ్ర సంస్థలతో బంధం లేకుంటే, నిజంగా ఆ దేశం కూడా ఉగ్రబాధిత దేశమే అయి ఉంటే.. తమ దేశంలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ కు కృతజ్ణతలు చెప్పుకోవాలి.

కానీ పాకిస్థాన్ ఆ పని చేయడం లేదు. పాక్ సైనికాధికారులు మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై ఉగ్రవాదుల శవాలపై వారి దేశ జెండా కప్పి అధికార లాంఛ నాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతేనా మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు భారీగా నష్టపరిహారం ఇస్తున్నారు.  నిషేధిత ఉగ్రవాద సంస్థ అధినేత, ప్రకటిత ఉగ్రవాది   మసూద్ అజార్‌కు ఇలా ప్రభుత్వం నేరుగా నష్టం పరిహారం ఇవ్వనుండటం వివాదాస్పదంగా మారింది. ప్రపంచ దేశాలకు పాక్ సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.