Publish Date:Apr 15, 2024
జగన్ పై జరిగిన గులకరాయి దాడి ఒక్క సారిగా యావత్ రాష్ట్రంలో సంచలన వార్త అయిపోయింది. ఎలాంటి శషబిషలూ లేకుండా ఈ దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు ఆస్కారం ఉండకూడదని నిర్ద్వంద్వంగా చెప్పేశారు. సీఎంపైనే దాడి అంటే భద్రతా వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలని, భద్రతా వైఫల్యానికి కారకులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
కానీ ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ తీరే అనుమానాస్పదంగా కనిపించింది. దాడి విషయంలో విపక్ష నేత చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పడానికి వైసీపీ తెగ తహతహలాడిపోతోంది. ఈ ఉత్సాహంలో జగన్ పై దాడి విషయంలో భద్రతా లోపం ఇసుమంతైనా లేదనీ, పోలీసులు వారి విధినిర్వహణలో బ్రహ్మాండంగా పని చేస్తున్నారని కితాబు కూడా ఇచ్చేసింది. స్వయంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మరీ పోలీసులను వెనకేసుకు వచ్చారు. దీంతో ఈ దాడి జగన్ కోసం జగన్ చేత జగనే చేయించుకుని సింపతీ కోసం పాకులాడుతున్నారన్న అనుమానాలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అయ్యాయి. పరిశీలకుల విశ్లేషణలు సైతం ఆ దిశగానే ఉన్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే ఈ దాడి విషయంలో జగన్ స్వంత చెల్లెలు షర్మిల స్పందన చూస్తూ తన అన్నపై దాడి జరిగిందని ఆమె ఏ మాత్రం నమ్మడం లేదని స్పష్టమౌతున్నది. మాజీ ముఖ్యమంత్రి స్వంత జిల్లా చిత్తూరులో ఆమె ఆదివారం (ఏప్రిల్ 14) ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో ఆమె జగన్ పై దాడి అంశాన్ని ఏ మాత్రం ప్రస్తావించలేదు. జగన్ ఐదేళ్ల పాలనా వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు. ఆయన వాగ్దానాల వైఫల్యాలపై నిలదీశారు.
అంటే జగన్ జనం సానుభూతి పొందాలన్న ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా తనపై తానే దాడి చేయించుకున్నారని షర్మిల భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ఈ సందర్భంగా నెటిజనులు మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమాను గుర్తు చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా విజయం కోసం ప్రజల సానుభూతి పొందేందుకు రాజకీయ నాయకుడు తన మీద దాడికి తానే సుపారీ ఇచ్చుకుంటాడు. తూటా పేలాలి.. తనకు తగలాలి కానీ ప్రాణాపాయం ఉండకూడదు అని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇప్పడుు గులకరాయి దాడితో జగన్ పై జరిగిన హత్యాయత్నం సంఘటన ఆ సినిమాను స్ఫురింప చేస్తోందని నెటిజనులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/own-sister-dont-believe-39-173840.html
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.