Publish Date:Jul 31, 2024
అతి తెలివితేటలకి ఆకారం ఇస్తే ఎలా వుంటుందంటే, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌లాగా వుంటుంది. అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు.. ఆయన ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా ఆ మాటల్లో అతి తెలివితేటలు స్టీరియో ఫోనిక్ సౌండ్ డీటీఎస్‌లో వినిపిస్తూ వుంటాయి. తమ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్ కుటుంబం భరించలేకపోతోంది. ఆ కడుపులో మంట కేటీఆర్ నోట్లోంచి బయటపడుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య పుల్లలు పెట్టే మాటలను అతి తెలివిగా మాట్లాడుతున్నారు. ఆ అతితెలివి మాటలను కేటీఆర్ తాను చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటూ వుండొచ్చు.. అది వేరే విషయం! మొదట్నుంచీ కేటీఆర్ అనే మాట ఏమిటంటే, ఉప ముఖ్యమంత్రిగా వున్న మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ డైలాగు కేటీఆర్ వీలున్నప్పుడల్లా వాడుతున్నారు. పైకి మాత్రం రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రి అవ్వాలన్న బిల్డప్పు, కానీ మనసులో వున్న పాయింట్ మాత్రం వేరే. మల్లు భట్టి విక్రమార్క మనసులో ‘ముఖ్యమంత్రి’ అనే బీజాన్ని నాటడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు సృష్టించాలన్నది కేటీఆర్ ప్లాన్. అందుకే భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈరకంగా పదకొండో శతాబ్దం రాజకీయ తెలివితేటలను కేటీఆర్ ఇరవై ఒకటో శతాబ్దంలో ఉపయోగిస్తున్నారు. ఈయన మాటలను మనసులో పెట్టేసుకునేంత అమాయకుడు కాదు భట్టి విక్రమార్క. అయినా దళితుడైన భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడు తెగ ఫీలైపోతున్న కేటీఆర్ తన తండ్రికి ఈ ఉపదేశం ఎందుకు చేయలేదో! తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. రెండుసార్లూ తానే ముఖ్యమంత్రి అయ్యారు. మూడోసారి కూడా తానే ముఖ్యమంత్రి అయి, నాలుగోసారి కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నారు. ఇప్పుడు భట్టి విక్రమార్క విషయంలో చేస్తున్న కామెంట్లు, కేటీఆర్ తన తండ్రి దగ్గరే చేసి వుంటే బాగుండేది కదా? అందుకే ఆచార్య ఆత్రేయ, ‘ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి’ అని ఏనాడో చెప్పారు. కేటీఆర్ లాంటివాళ్ళు ఆ నీతులను ఈనాడూ అమలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/over-smartness-of-ktr-39-181869.html
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.