తూచ్ .. జగన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదు

Publish Date:Sep 22, 2022

Advertisement

చెప్పేవాడికి వినేవాడు లోకువ. ఆ చెప్పేది శ్రీ సర్కార్ స్వామి అయితే, ఇక చెప్పడానికి ఏముండదు. ఎప్పుడో కాదు, జస్ట్ ఓ రెండు నెలల కిందట, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ, అధికార దర్పంతో అత్యంత ఘనంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లోనే జగన్ రెడ్డి తల్లి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను సగౌరవంగా పార్టీ నుంచి సాగనంపారు. అదే సమావేశాల్లో   జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

ఇదేమీ రహస్యంగా జరిగిన తంతు కాదు. బహిరంగంగానే జరిగింది. ప్లీనరీలో జగన్‌ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లుగా, మరెవరో కాదు, పార్టీలో నంబర్ 2  విజయసాయి రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. నాయకులు జగన్ రెడ్డిని అభినందనలతో  ముంచెత్తారు. శాలువాలు కప్పారు, బొకేలు ఇచ్చారు. జగనన్న గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడారు. జగన్ రెడ్డి రాజ దర్పంతో చిరునవ్వు చెరగకుండా ఈ మొత్తం క్రతువును చక్కగా ఎంజాయ్ చేశారు. అలాగే, తనపై విశ్వాసం ఉంచి, పార్టీ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పార్టీలోని ప్రతి ఒక్కరికీ తనదైన స్టీల్లో చేతులెత్తి కృతజ్ఞలు చెప్పారు. ఇదంతా పార్టీ క్యాడర్ కన్నుల పండగగా చూశారు. చప్పట్లు కొట్టారు, చిందులేశారు. 

అయితే, ఇప్పుడు  నా పార్టీ నా ఇష్టం, అంటే కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ‘శాశ్వత’ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెత్తిన అక్షింతలు వేసింది. ఒక పద్దతి ప్రకారం, ప్రజాస్వామ్య పద్దతిలో అధ్యక్షుని ఎన్నిక జరగాలని తాఖీదు ఇచ్చింది. సరే జరిగిందేదో జరిగిందని, అలా ఉరుకుంటే ఎలా ఉండేదో ఏమో కానీ,  ఏపీ ప్రభుత్వ ‘అల్ ఇన్ వన్’ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాజును మించిన విధేయతను చూపించారు. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లు మీడియా ముందు అబద్ధాలు చెప్పడంలో తమ  అనుభవం మొత్తాన్నిరంగరించి, అందమైన అబద్ధాలను అలవోకగా ప్రవచించారు. 

జగన్ రెడ్డిని శాశ్వత అధ్యక్ష పదవిన ఎన్నుకున్నది నిజమే కానీ, ఆయన అంగీకరించలేదని, అందుకే ప్లీనరీ మినిట్స్ లో చేర్చ లేదని చక్కగా చెప్పుకొచ్చారు. అంగీకరించకపొతే  ఆ అభినందనలు , హారతులు ఎందుకు? ఆ చిరు నవ్వులు ఎందుకు, అదే విషయం అప్పుడే అక్కడే  ఆయనే చెప్పి ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాయవలసిన అవసరమే ఉండేది కాదు కదా  అంటే, దానికి సజ్జల దగ్గర సమాధానం లేదు. పోనీ అప్పుడు కాకపోయినా, ఆ తర్వాత ఎన్నికల్ సంఘం నుంచి  రెండో మూడో తాఖీదు లేఖలు అందిన తర్వాత అయినా  ఒక ప్రకటన ఇస్తే ఇంతవరకు రాకపోను కదా, అంటే  అందుకూ సమాధానం లేదు. అందుకే అంటారు, అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలని. అయినా పుర్వాశ్రయంలో పాత్రికేయులుగా పని చేసిన సజ్జల వారికి, ప్రజాస్వామ్యంలో శాశ్వత పదవులు ఉండవని.. తెలియక పోవడం ఏమిటని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.