ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడుముక్కలాట!

Publish Date:Apr 1, 2025

Advertisement

మంత్రుల పర్యటన వేళ అధికారులకు అష్టకష్టాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నతాధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది.  ముగ్గురు మంత్రుల పర్యటనల నేపథ్యంలో వారి పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెతను తలపిస్తోంది.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురికి అవకాశం లభించింది. ఈ ముగ్గురిలో తుమ్మల నాగేశ్వరావుకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మిగిలిన ఇద్దరూ మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలిసారిగా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు.

జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తంచేశారు. కార్యకర్తలు కూడా తమ నాయకులు మంత్రులు అయ్యారనే సంతోష పడుతున్నారు.  ఇంతవరకు బాగానే ఉంది కానీ మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం అధికారులు హైరానా పడుతున్నారు.  ముగ్గురులో ఎవరు జిల్లా పర్యటనకు వచ్చినా కలెక్టర్ తోపాటు జిల్లా స్థాయి అధికారులంతా కార్యక్రమాలకు హాజరు కావాల్సిందే. ఒక్కోసారి ముగ్గురూ జిల్లాలో ఉంటే అధికారులు పరుగులు పెట్టాల్సిందే. ఎవరి కార్యమంలో పాల్గొనకపోతే  ఎమవుతుందోనని హడలిపోతున్నారు. అంతే కాకుండా మంత్రులు వరుస పర్యటనలతో అధికారులకు వారి కార్యక్రమాలకు హాజరు కావడానికే సమయమంతా సరిపోతోంది. వారంలో ముగ్గురు మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చారంటే అధికారులు ఆఫీసులకు వెళ్లకుండానే పర్యటనలకు హాజరవుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉండటంతో పాటు కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు చూడాల్సి ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా మంత్రులు పర్యటనలకు వచ్చారంటే తప్పనిసరిగా హాజరుకావాల్సిందే. 

ఇక అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కొరవడుతున్నది. ఈ పరిస్థితి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాల అధికారులు ఎదుర్కొంటున్నారు.. మరో వైపు ఖమ్మం పట్టణంలో ఏ మంత్రి పర్యటించినా పోలీసు, అధికార యంత్రాంగం అంతా మంత్రి కాన్వాయ్ లోనే ఉంటున్నారు..

దీంతో పట్టణ ప్రజలు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కాన్వాయ్ లో భారీగా వాహనాలు ఉండటం వల్ల కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రజల వాహనాలను నిలిపివేస్తున్నారు. కాన్వాయ్ లో మంత్రుల వాహనాలతో పాటు అనుచరగణం భారీగానే పాల్గొంటున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. తుమ్మల నాగేశ్వరావు మాత్రం సీతారామ ప్రాజెక్టు వెంటపడి  సాగర్ కాలువలకు లింక్ చేశారు. భట్టి, పొంగులేటి గ్రామీణ రహదారులను బాగుచేసే పనిలో ఉన్నారు.

By
en-us Political News

  
వివాదాస్పద లేడీ అఘోరీ  చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల కు ఇంట్లో బస చేసిన  అఘోరీ మాయమాటలు చెప్పి  శ్రీ వర్షిణిని లోబరుచు కుంది.
ఎమ్మెల్సీగా నాగబాబు తన తొలి అధికారిక పర్యటన పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు. జనసేన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మొట్టమొదటి సారిగా అధికారికంగా పిఠాపురం నియోజకకవర్గంలో శుక్రవారం (ఏప్రిల్ 4) పర్యటించారు.
తెలంగాణ బిజెపిలో విభేధాలు ముదిరిపోతున్నాయి. హైద్రాబాద్ కు చెందిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్  కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనుకున్నదే జరిగింది. వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను, 24 గంటల తేడాతో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. అర్థరాత్రి ఆమోదం పొందిన బిల్లుల జాబితాలో, వక్ఫ్‌ సవరణ బిల్లు-2024- (యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియన్సీ అండ్‌ డెవల్‌పమెంట్‌- యూఎంఈఈడీ-ఉమీద్‌) బిల్లు కూడా చేరింది. అవును. సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం (ఏప్రిల్ 2) అర్ధరాత్రి దాటాక లోక్‌సభ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు, గురువారం (ఏప్రిల్3) అర్థరాత్రి దాటిన తర్వాత రాజ్యసభ ఆమోదం తెలిపింది.
తెలంగాణ రాజకీయాలు ఇప్పడు ఢిల్లీ చేరుకున్నాయా? జంతర్ - మంతర్ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ రాజకీయాలకు వేదికగా మారుతున్నాయా? అంటే మంగళవారం (ఏప్రిల్ 1) దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చోటు చేసుకున్న విభిన్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
  బంగ్లాదేశ్ చైనా, పాక్ లకు మద్దత్తు నిస్తున్న నేపథ్యంలో  భారత ప్రధాని మోడీ   బ్యాంకాక్ లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో సీఐడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ, తనపై కేసులను కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయన సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
దేశంలోనే తొలి సారిగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని ద్వారా అందించే సేవలను పెంచుతూ మరింత ప్రతిభామంతంగా తీర్చిదిద్దుతున్నది. ఈ ఏడాది జనవరి 30న ఏపీలో మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే.
 ఎయిడ్స్ నియంత్రణలో గతేడాది 17 వ స్థానంలో ఉన్న ఎపి ఈ యేడు ఏడో స్థానానికి ఎగబాకింది.  జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ( న్యాకో)  వివిధ రాష్ట్రాల సూచిక విడుదల చేసింది. ఎయిడ్స్ నియంత్రణలో ఎపి కనబరిచిన కృషిని న్యాకో కొనియాడింది
పూడిక తీయడానికి బావిలోకి దిగి అందులోని విషవాయువుల కారణంగా ఎనిమిది మంది మరణించిన సంఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని కొండావత్ గ్రామంలోని పురాతన బావిలో బురద పేరుకుపోవడంతో దానిని శుభ్రం చేయాలని జిల్లాయంత్రాంగం భావించింది.
కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది. బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. వైసీపీ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నతలు కర్మఫలం అనుభవించడానికి రెడీ కావలసిన పరిస్థితి ఏర్పడింది.
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి తాజాగా  మరో వివాదంలో చిక్కుక్కున్నారు.  నిత్యానంద స్వామి చనిపోయినట్టు ఆయన మేనల్లుడు  ప్రకటన  చేసిన సంగతి తెలిసిందే. ఆస్తుల విషయంలో  మేనమామతో వచ్చిన విభేధాల వల్ల మేనల్లుడు ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం (ఏఫ్రిల్ 4) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు తెలంగాణలో వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, ములుగు, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.