ఉగ్రముఠాల రవాణా మార్గంగా ఇండియా.. జాతీయ భద్రతకు కొత్త సవాల్!

Publish Date:Mar 27, 2026

Advertisement

దేశ భద్రతకు సంబంధించి కొత్త సవాల్ ఎదురైందా?  భారత్  ఉగ్రవాదుల రవాణా మార్గంగా మారుతోందా? అంటే జాతీయ భద్రతా సంస్థ ఎన్ఐఏ దర్యాప్తులో తేలిన విషయాలు ఔననే అంటున్నాయి.  పర్యాటక వీసాల ముసుగులో దేశంలోకి ప్రవేశించి అంతర్జాతీయ ఉగ్ర కుట్రకు పాల్పడుతున్న ఓ ముఠాను ఇటీవల ఎన్ఐఏ కోల్ కతాలో అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో  అమెరికాకు చెందిన మాథ్యూ వాన్‌డైక్‌ సహా మరో ఆరుగురు ఉక్రేనియన్లు ఉన్నారు. రష్యా నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో ఈ అరెస్టులు జరిగాయి.

వీరి విచారణలో  విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.   ఈశాన్య రాష్ట్రాలు  మయన్మార్ వంటి పొరుగు దేశాల్లోని అస్థిరతను సొమ్ము చేసుకుని ఇక్కడి తిరుగుబాటుదారులకు ఆయుధ సహా అన్ని విధాలుగా శిక్షణ ఇస్తున్నట్లు వెలుగు చూసింది. అంతే కాకుండా ఈ ముఠా   అంతర్జాతీయ అస్థిరత సృష్టించేందుకు ఉగ్ర రవాణాకు ఇండియాను ఉపయోగిస్తున్నట్లు తేలింది.   ఐరోపా నుంచి అత్యాధునిక డ్రోన్లను భారత్ మీదుగా మయన్మార్‌లోని తిరుగుబాటుదారులకు చేరవేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేవలం పరికరాల సరఫరానే కాకుండా, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలు, డ్రోన్ల తయారీ మరియు మరమ్మతులపై అక్కడి ఉగ్రవాద గ్రూపులకు వీరు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

మాథ్యూ వాన్‌డైక్‌ ముఠా  పర్యాటక వీసాలపై భారత్‌కు వచ్చినట్లు గుర్తించారు. వీరే కాకుండా ఇంకా మరి కొందరు కూడా ఇలాగే పర్యాటక వీసాలతో వచ్చి అసోం, మిజోరం వంటి   ప్రాంతాల్లో సంచరించినట్లు వెల్లడైంది. విదేశీయులు ఈ ప్రాంతాల్లో పర్యటించాలంటే  రక్షిత ప్రాంత పర్మిట్  తప్పనిసరి. అయితే, అలాంటి ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ ప్రాంతాలలో సంచరిస్తుండటమే కాకుండా యథేచ్ఛగా సరిహద్దులు దాటి  మయన్మార్ చేరుకున్నట్లు కూడా ఎన్ఐఏ దర్యాప్తు తేల్చింది.  మయన్మార్ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బృందాలకు వీరు సహకరించడమే కాకుండా,  ఈశాన్య తిరుగుబాటు సంస్థలతో కూడా సంబంధాలు ఏర్పరుచున్నట్లు ఎన్ఐఏ ధృవీకరించింది. 
అదలా ఉంటే ఎన్ఐఏ కోల్ కతాలో అరెస్టు చేసిన వారిలో ముఖ్యుడైన వాన్‌డైక్  సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థను నిర్వహిస్తూ..  గతంలో లిబియా, సిరియా వంటి దేశాల్లో జరిగిన అంతర్యు ద్ధాల్లో పాల్గొన్నాడు.  యుద్ధాలను ఆసరాగా చేసుకుని..  ఒక దేశం నుంచి మరో దేశానికి కిరాయి ముఠాలను పంపడం వ్యాన్ డైక్ సంస్థ పని.  ఇందుకోసం వాన్ డైక్ ఇండియాను సురక్షిత రవాణా మార్గంగా ఎంచుకున్నట్లు ఎన్ఐఏ భావిస్తోంది.  వాన్ డైక్ తదితరులపై   ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఉపా కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

By
en-us Political News

  
ళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో ఇప్పుడు కదలిక రావడమే కాకుండా వేగం పుంజుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే ప్రాజెక్టులు రెండూ కలిపి 21వేల 616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 84.63 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.
మీ స్మార్ట్‌ఫోన్ మరియు డిజిటల్ డేటాను హాకర్లు, డేటా చోరీ నుండి ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకోండి. నార్టన్, 1పాస్‌వర్డ్, ప్రొటాన్ మెయిల్ మరియు అథెంటికేటర్ యాప్‌లతో అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ గైడ్.
USB పెన్ డ్రైవ్‌ల వాడకం ఎందుకు తగ్గింది? క్లౌడ్ స్టోరేజ్, స్మార్ట్‌ఫోన్‌లు, వేగవంతమైన SSDలు డేటా నిల్వ ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో, పెన్ డ్రైవ్‌ల భవిష్యత్తు ఏమిటో ఈ వెబ్ స్టోరీ ద్వారా తెలుసుకోండి.
రన్నింగ్ అంటే విసుగు చెందే వారికి గూగుల్ జెమిని AI మరియు గార్మిన్ స్మార్ట్‌వాచ్ ఎలా ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయో ఈ కథనంలో తెలుసుకోండి. 14 కిమీ సిటీ2సర్ఫ్ పరుగు కోసం జెమిని అందించిన 3 దశల వర్కౌట్ ప్లాన్, హెల్త్ టిప్స్ మరియు ఫిట్‌నెస్ సీక్రెట్స్ మీ కోసం!
నల్సార్ క్యాంపస్‌లోని  విద్యార్థుల  మాత్రం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానించడానికి వీల్లేదంటూ వ్యతిరేకిండం కలకలం రేపింది. దాదాపు  వర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించవద్దంటూ దాదాపు 450 మంది విద్యార్థులు సంతకాలు చేసిన లేఖను వర్సిటీ వీసీకి సమర్పించారు. 
ఆగస్టు 10 నాటి పసిడి మరియు వెండి రిటైల్ ధరల పూర్తి సమాచారం. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో 24K, 22K బంగారం మరియు కిలో వెండి తాజా రేట్లు, MCX మార్కెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్ లైవ్ అప్‌డేట్స్: సెన్సెక్స్, నిఫ్టీ పతనం, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్ల కదలికలు, ఐటీ రంగం రికవరీ మరియు ఎస్‌బీఐ క్యూ1 ఫలితాల పూర్తి విశ్లేషణ. గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, గిఫ్ట్ నిఫ్టీ స్థాయిలు మరియు ఈ వారం ఇన్వెస్టర్లు పాటించాల్సిన కీలక వ్యూహాలను క్షుణ్ణంగా తెలుసుకోండి.
చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ షాంఘై మార్కెట్లో ఐపీఓగా అడుగుపెడుతోంది. $8.5 బిలియన్ల వ్యాల్యుయేషన్, హ్యూమనాయిడ్ రోబోట్ల విక్రయాలు, మరియు ప్రపంచ రోబోటిక్స్ రంగంలో చైనా సాధిస్తున్న తిరుగులేని ఆధిపత్యం గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
సెప్టెంబర్ నెల నుంచి బ్రిటానియా, HUL, డాబర్, గోద్రేజ్ వంటి ప్రధాన FMCG కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ష్రింక్‌ఫ్లేషన్ వ్యూహం, పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు మరియు మీ ఇంటి బడ్జెట్‌పై పడే ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
లీప్ ఇండియా ఐపీఓ డే 2 సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, ప్రస్తుత గ్రే మార్కెట్ ప్రీమియం GMP , లాట్ సైజ్, ప్రైస్ బ్యాండ్ మరియు బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్‌తో కూడిన పూర్తి విశ్లేషణ.
వెస్టిండీస్ జట్టు 2027 వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమైంది. కరేబియన్ క్రికెట్ చరిత్ర, 1975 79 విజయాలు మరియు ప్రస్తుత క్వాలిఫికేషన్ సవాళ్ల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అక్రమ అరెస్టులు, అపహరణలతో బలోచ్ అట్టుడికిపోతోంది. అక్రమ అరెస్టలు, అపహరణలూ, పట్టపగలే సాయుధ దుండగులు పాల్పడుతున్న హత్యాకాండకు వ్యతిరేకంగా బలోచ్ ప్రజలు గట్టిగా గళం విప్పుతున్నారు. ఆ ప్రజా గళాన్ని అణచివేసేందుకే ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధిస్తూ, నిర్బంధాన్ని అమలు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన సర్ఫరాజ్ ఖాన్, రెండో ఇన్నింగ్స్‌లో 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి 150 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ చారిత్రాత్మక రికార్డు వివరాలు, గణాంకాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.