ప్రస్తుతం జైల్లో ఉన్న బెలారస్ మానవహక్కుల నాయకుడు అలెస్ బియాలియట్స్కీ, రష్యా మానవ హక్కుల సంస్థ, ఉక్రెయిన్ మానవహక్కుల కేంద్రం 2022 సంవత్సరం నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయినట్టు ఓస్లోలోని నోబెల్సంస్థ ప్రకటించింది. అలెస్ మరియు శాంతి బహుమతి అందుకోనున్న ఆ రెండు సంస్థలూ తమ తమ ప్రాంతాల్లో పౌరహక్కులు, ప్రజలు ఎదర్కొంటున్న వ్యవస్థాగత సమస్యల గురించి పోరాడటంలో ఎంతో కృషి చేసినట్టు నోబెల్ సంస్థ తన ట్విటర్లో వివరించింది. కాగా అలెస్ ను జైలు నుంచి విడుదల చేయాలని నోబెల్ కమిటీ బెలారస్ అధికారులను కోరింది. అలెస్ తన దేశం లో ప్రజాస్వామ్యం, శాంతియుత అభివృద్ధిని ఎంతో ఆకాంక్షించారు. అందుకు ఎనలేని కృషి చేశారని నోబెల్ కమిటీ ప్రశంసించింది.
అలెస్ 1996లో వియాస్నా(స్ప్రింగ్) అనే సంస్థను నెలకొల్పి జైళ్లలో మగ్గుతున్న అనేకమంది రాజకీయ ఖైదీల పరిస్థితులను వెలుగులోకి తీసుకువచ్చారు. మానవహక్కులను తుంగలో తొక్కుతున్నారని ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు.
ఉక్రెయిన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థ ఆ దేశంలో ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణకు ఏర్పాటయింది. అక్కడ పూర్తిస్థాయిలో ప్రజాస్వామ్యం నెల కొనేందుకు ఎంతో పాటుపడిందని నోబెల్ కమిటీ పేర్కొన్నది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత రష్యా కుతంత్రాలు, దాడులపై ప్రత్యేకంగా డాక్యుమెంట్ రూపొందించడంలో కీలకపాత్ర వహిం చింది.
అలాగే 1987లో ఆరంభమయిన మెమోరియల్ సంస్థ పాత సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టు పాల కుల చేత అణచివేతకు గురయినవారిని రక్షించడంలో వారి కోసం పాటుపడిన సంస్థగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ముఖ్యంగా చెచెన్ యుద్దాల సమయంలో, రష్యా, రష్యా మద్దతు దారుల దాడులకు గురయిన వారి పరిస్థితులు, దేశం ఎదుర్కొన్న దుర్భర స్థితుల గురించి ఎంతో సమాచారం సేకరించి మానవహక్కుల సంరక్షణ విషయంలో గొప్ప కృషి చేసిన గుర్తింపు పొందింది. ఫలితంగా, 2009 లో ఈ మెమోరియల్ చెచెన్యా విభాగం అధ్యక్షుడు నలాలియా ఎస్టిమిరోవా హత్యకు గురయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nobel-peace-prize-to-belarus-humanrights-leader-39-145051.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.