Publish Date:Mar 15, 2025
బీఆర్ఎస్ ను తెలంగాణ సమాజం పెద్ద సీరియస్ గా తీసుకోలేదా?.. ఆ పార్టీ ఇచ్చిన నిరసన పిలుపును పట్టించుకోలేదా? అంటూ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేస్తున్న విమర్శలను, ప్రభుత్వ విధానాలపై చేస్తున్న పోరాటాలనూ తెలంగాణ సమాజం పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇందుకు ఉదాహరణలుగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టైనప్పుడు ప్రజల నుంచి ఏ మాత్రం వ్యతిరేకత రాని విషయాన్ని గుర్తు చేయడమే కాకుండా, ఆ తరువాత ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరవ్వడాన్ని కూడా జనం పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు.
ఇక తాజాగా అసెంబ్లీ నుంచి ప్రస్తుత బడ్జెట్ సెషన్ పూర్తయ్యే వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి నిరసనగా గురువారం (మార్చి 13)న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా శుక్రవారం (మార్చి 14) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరగలేదు. అధవా కొన్ని చోట్ల జరిగినా జనం భాగస్వామ్యం కనిపించలేదు. అతి తక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు మాత్రమే మొక్కబడిగా నిరసన తెలిపారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వంటి నేతలు కూడా పార్టీ ఇచ్చిన నిరసన పిలుపు కంటే హోలీ వేడుకలకే ప్రాధాన్యత ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-response-for--brs-protest-call-25-194420.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.