Publish Date:Nov 18, 2024
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అంటే జగన్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కోసం రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అదే విధంగా ఆయన తీసిన వ్యూహం సినిమాలో కూడా వీరిని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి.
వీటిపైనే ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు రామలింగం ఫిర్యాదు మేరకు కూసు నమోదైంది. విచారణకు హాజరు కావాలంటూ ఏపీ పోలీసులు హైదరాబద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వచ్చి నోటీసులు అందజేశారు. ఆ నోటీసుల ప్రకారం రామ్ గోపాల్ వర్మ మంగళవారం (నవంబర్ 19) పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ తనపై నమోదైన కేసు కొట్టివేయాలనీ, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలనీ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రామ్ గోపాల్ వర్మ పిటిషన్ సోమవారం (నవంబర్ 18) విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేస్తూ.. అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. అంతే కాకుండా పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు మంగళవారం (నవంబర్ 19)న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-respite-to-ramgopalcerma-in-high-court-25-188551.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!