ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇల్లు లేదు..!

Publish Date:Apr 10, 2025

Advertisement

అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ ఇళ్లు కట్టిస్తాం.. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు  చేసే ప్రధాన వాగ్దానాలలో ఇదొకటి.  పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లోనూ  అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల్లో ఇంటి’  హామీ గ్యారెంటీ’గా ఉంటుంది. అయితే, పేర్లు మారుతూ ఉంటాయి. ఒకరు ఇందిరమ్మ ఇళ్లు, అంటే ఇంకొకరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటారు. ఇంకొకరు  డబల్ బెడ్  రూమ్ హామీ ఇస్తారు. 

అయితే  ఇచ్చిన హామీలను అమలు చేసే ఆచారం మన రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు పెద్దగా లేదు కనుక  పేదోడి సొంత ఇంటి కల, ప్రతి మేనిఫెస్టోలోనూ ఉంటుంది కానీ  భూమి మీద కనిపించదు. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ కల ఎప్పటికీ అలా పగటి కలగానే మిగలి పోతోంది. కొద్ది మంది అదృష్ట వంతులకు మినహా పేదలు అందరికీ ఇల్లు అనే లక్ష్యం  ఇంత వరకు నెరవేర లేదు. ఇక ముందు నెరవేరుతుందన్న ఆశ కూడా లేదు. 

పేదల సంగతి సరే.. కానీ,ఇప్పడు సమస్య పేద ప్రజలది కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే ఇంటి సమస్య వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం లేక అవస్థలు పడుతున్నారు. అవును. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా  అధికార బాధ్యతలు చేపట్టి 50 రోజుల పైనే అయింది. అయినా ఇంతవరకు ఆమెకు అధికారిక నివాసం కేటాయింపు జరగలేదు. సో .. చేసేది లేక ఆమె షాలిమార్‌ బాగ్‌లోని తమ సొంత ఇంటి నుంచే’ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే  షాలిమార్ భాగ్  నుంచి సచివాలయానికి వెళ్ళాలంటే  పాతిక కిలో మీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది ఆమెకు  మాత్రమే కాదు సామాన్యులకు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది.  

ట్రాఫిక్ అంక్షల కారణంగా అదే దారిలో ప్రయాణించే సామాన్య ప్రజలకు కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటోంది. అలాగ.. షాలిమార్ బాగ్ లో ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న  ప్రాంతం భద్రతాపరంగా, ఇతరత్రా అంత అనువుగా లేదని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి  ప్రస్తుత వాసంలో  వాహనాల పార్కింగ్ కు తగినంత స్థలం లేదు. దీంతో ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చి పోయే ప్రజలు,  వీఐపీలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే,ముఖ్యంత్రి రేఖా గుప్తా త్వరగా  ఓ ఇల్లు చూసుకోవాలని ఇటు ప్రజలు, అటు అధికారులు కూడా కోరుకుంటున్నారు. 

నిజానికి  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ముందు చూపుతో సర్వ సదుపాయాలు, సర్వ సౌకర్యాలతో ముఖ్యంత్రి అధికార నివాసం  షీష్ మహల్  కట్టించారు. అయితే, షీష్ మహల్   నిర్మాణానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున  దుర్వినియోం చేసిందని  అప్పట్లో బీజేపీ ఆరోపించింది. ఆరోపణల్లో ఎంత నిజం వుందో  తెలియదు కానీ  మొన్నటి ఎన్నికల్లో ఆప్’ ఓటమికి షీష్ మహల్  (అద్దాల మేడ) పై వచ్చిన ఆరోపణలు కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచాయి. 

సో.. అన్నిఅరోపణలు చేసి  అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి  ఇంచక్కా వెళ్లి షీష్ మహల్లో సెటిలైపోతే  పరువు అసలు దక్కదని  బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. నిజానికి  ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్  రాజీనామా చేసిన తర్వాత కొద్ది కాలం తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి  కూడా షీష్ మహల్ లో కాలు పెట్టలేదు. 

అదలా  ఉంటే ఇప్పడు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తమ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న సివిల్‌ లైన్స్‌ లేదా లుటియెన్స్‌ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లుటియెన్స్‌ ప్రాంతంలో నివాసం కావాలంటే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి అవసరం. దీంతో అధికారిక నివాసం కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు.ఇప్పటికే ప్రతిపక్ష నేత  మాజీ ముఖ్యమంత్రి అతిషి, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు అందరికీ అధికార నివాసాలు కేటాయించిన అధికారులు, ముఖ్యమంత్రి ఇంటి సమస్యకు మాత్రం ఒక పరిష్కారం చూపలేక పోతున్నారు.

By
en-us Political News

  
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.