హోంమంత్రి బాధ్యతా రాహిత్యం.. శాంతి భద్రతలు ఎక్కడ తానేటి వనితా మేడం

Publish Date:May 3, 2022

Advertisement

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత వైఖరి. రాష్ట్రంలో ఏం
జరిగినా అది విపక్ష తెలుగుదేశం పనే అంటున్నారామె. రాష్ట్రంలో రోజూ మూడు మర్డర్లు, ఆరు రేపులు అన్నట్లుగా నేర సామ్రాజ్యం వర్ధిల్లుతుంటే.. నేరలను అరికట్టి నేరగాళ్ల పీచమణచాల్సిన పదవిలో ఉన్న తానేటి వనిత  విపక్షాలపై నెపం మోపి బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడటం దారుణం.  ప్రభుత్వంలో ఉన్న వారు విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.    అత్యాచార ఘటనలపై సహజంగానే విపక్షాలు విమర్శలు సంధిస్తాయి. నేరాలు వరుసగా అదుపులేకుండా జరుగుతున్నాయంటే అది కచ్చితంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యమే. శాంతి భద్రతల పరిరక్షణకు మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాల్సిన హోంమంత్రి విపక్ష టిడిపి వాళ్ల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం బాధ్యతా రాహిత్యం తప్ప మరొటి కాదు.  రేపల్లె సామూహిత అత్యాచారం సంఘటనకు మద్యం మత్తే కారణమంటూ తేలిగ్గా తీసుకోవడం హోంమంత్రికి అందునా ఒక మహిళకు ఎంత మాత్రం తగదు. ఇటువంటి సంఘటనలు ఏపీలో నిత్యకృత్యంగా మారిపోవడం అన్నది రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పాలి.

చట్టాలు చేశామని చెప్పుకుంటే సరిపోదు. అవి సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.  ఎపిలో చోటు చేసుకుంటున్న సామూహిక అత్యాచార ఘటనలను మహిళలు బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఉంది.  ఆంధప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనల నిరోధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా మంత్రుల స్థాయిలో ఉన్న వారు కూడా నేరస్తులకు వత్తాసు పలుకుతున్నట్లుగా మాట్లాడటం వారిని ప్రోత్సహించడం తప్ప మరొకటి కాదు.  మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభించడం కూడా ప్రభుత్వ వైఫల్యమే.  ఇలాంటి ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు వేయాలి. అలా కాకుండా సర్కార్ ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో నేరాలు పెట్రేగిపోతున్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం. కొన్ని సంఘటనల్లో అధికార పార్టీ వారి జోక్యం వల్ల పోలీసులు నిందితులను తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా రాష్ట్రంలో నేర సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా విస్తరించడానికి కారణమౌతున్నది.

ఈ వాస్తవాలన్నిటినీ పట్టించుకోకుండా అన్నీ వేదాల్లోనే ఉన్నాయష.. అన్నట్లుగా అన్నిటికీ విపక్షమే కారణమంటూ హోంమంత్రి నిర్ధారణకు వచ్చేయడం బాధ్యతా రాహిత్యం కాక మరొకటి కాదు.    ఖజానా నింపడానికి మద్యం అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్టాలు, ఆ మత్తులో జరిగే నేరాలకు బాధ్యత వహించి తీరాలి. ఆ నేరాల్ని పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మద్రాసు హైకోర్టు 2019 మార్చిలో తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో నిందితులు చేసే నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత అంటూ ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం. అంటే మద్యం విక్రయాలతో ఖజానా నింపుకోవడమే కాదు.. ఆ కారణంగా అకృత్యాలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పరోక్షంగా హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకుం టున్న అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు. అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ యువకుడు  కన్నతల్లిపైనే అత్యాచారానికి యత్నించాడు. అడ్డుకున్న తండ్రిపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన తల్లిని బండరాయితో వెూది చంపేశాడు. అనంతపురం జిల్లాలో 33 ఏళ్ల యువకుడు   కన్నతల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎంత వారించినా వినకపోవటంతో తల్లిదండ్రులు అతడిని చంపి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో కన్న కుమార్తెపైనే అత్యాచారయత్నం చేసిన ఘటన కొన్నాళ్ల కిందట ఏలూరు జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. ఇక అంతకుముందు స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

మచిలీపట్నం తాలూకా కరగ్రహారం శివారు పల్లిపాలెం బీచ్‌లో నెల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది.  సీఎం జగన్‌ నివాసానికి అత్యంత సవిూపంలో ఉన్న సీతానగరం పుష్కర్‌ ఘాట్‌కు.. కాబోయే భర్తతో కలిసి విహారానికి వెళ్లిన యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ‘దిశ’ ఏమైందో, ఎక్కడుందో తెలియడం లేదు. నేరాల నియంత్రణ విషయంలో శాంతి భద్రతలను నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ దిశ, దశ లేక నిర్వీర్యమై నిస్తేజంగా మిగిలిపోయింది. పోలీసుల విధి నిర్వహణలో ప్రభుత్వ మితిమీరిన జోక్యమే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో పులివెందుల రాజ్ నడుస్తోందన్న విపక్షాల విమర్శలు వరుసగా జరుగుతున్న అకృత్యాలు  వాస్తవమే అనిపించేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.