మంగళగిరి విషయంలో తగ్గేదేలే.. లోకేష్.!

Publish Date:Jul 22, 2026

Advertisement

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో  తగ్గేదే లే.. అంటున్నారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఈ విషయంలో  అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంతోనైనా పోరాడి నిధులు సాధిస్తానని ప్రకటించారు.  ఇటీవల మంగళగిరిలో జరిగిన ఒక  సభలో ప్రసంగించిన నారా లోకేష్..  తన నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమన్నారు. మంగళగిరి అభివృద్ధికి అవసరమైన నిధులు సాధించే విషయంలో, కొత్త ప్రాజెక్టులను మంజూరు చేయించుకోవడంలోనూ , పాలనాపరమైన అనుమతులను సాధించే దిశగా ముందుకు సాగడంలోనూ రాజీ ప్రశక్తే లేదన్నారు.  ఇందు కోసం అవసరమైతే ఎవరితోనైనా పోరాడతానన్నారు. 

మంగళగిరి ప్రజలు 2024 ఎన్నికలలో తనపై చూపిన నమ్మకం, అఖండ మెజారిటీతో కట్టబెట్టిన విజయమే తనలో ఈ ధైర్యాన్ని నింపాయని చెప్పారు.   భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన ప్రజల రుణం తీర్చుకోవడం తన ప్రాథమిక బాధ్యతన్న ఆయన.. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో  వెనక్కు తగ్గేదే లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ..  తన సొంత నియోజకవర్గ ప్రయోజనాలు వచ్చేసరికి ఎంతటి పెద్ద నాయకుడినైనా ప్రశ్నించేందుకు, పట్టుబట్టి పనులు సాధించేందుకు వెనుకాడనన్నారు.  

రాజకీయంగా ఈ వ్యాఖ్యలు  ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కూటమి రాజకీయం, పార్టీ సమన్వయాన్ని కాపాడుకుంటూనే, ఒక ప్రజాప్రతినిధిగా తన సొంత నియోజకవర్గానికి  ప్రథమ ప్రాధాన్యత నిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. లోకేష్ తన వ్యూహాన్ని రూపొందించుకున్నారు. 

గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది. ప్రస్తుతం మంత్రిగా పలు కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నప్పటికీ, మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ  ఆయనను నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గర చేసింది. నియోజకవర్గంలో అందరి వాడుగా గుర్తింపు నిచ్చింది.  ఒకవైపు రాష్ట్రస్థాయి నిర్ణయాల్లో భాగస్వామి అవుతూనే, మరోవైపు తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు శ్రమిస్తున్నారు లోకేష్. 

ఆ క్రమంలోనే మంగళగిరిని రాష్ట్రానికే సరికొత్త మోడల్‌గా తీర్చిదిద్దే దిశగా   మంత్రి నారా లోకేష్ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి ప్రాతిపదికగా   ప్రగతి ప్రణాళికలను ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, దశాబ్దాలుగా నలుగుతున్న భూహక్కుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు.  కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల దైనందిన జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.  మంగళగిరి,  తాడేపల్లి మండలాల పరిధిలో దశాబ్దాలుగా స్వంత ఇళ్లపై చట్టబద్ధమైన హక్కులు లేక ఆందోళన చెందుతున్న వేలాది నిరుపేద కుటుంబాలకు ఊరట కలిగిస్తూ, 'మన ఇల్లు - మన లోకేష్' కార్యక్రమం ద్వారా శాశ్వత ఇళ్ల పట్టాలు, ఆస్తి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. 

రవాణా, పారిశుధ్య సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు మంగళగిరి రూపురేకలను  మారుస్తున్నాయి.  నంబూరు, మంగళగిరి రైల్వే సెక్షన్ పరిధిలోని లెవల్ క్రాసింగ్ వద్ద దశాబ్దాలుగా వేలాది మంది ప్రయాణికులు  ఇబ్బందులు పడే వారు.   రోజుకు పదుల సంఖ్యలో రైళ్లు వెళ్లే సమయంలో గేటు పడి.. గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చే ఈ సమస్యకు చెక్ పెడుతూ..  142 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో  నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి పునాది రాయి పడింది.  767 మీటర్ల పొడవు, నాలుగు లేన్ల విస్తరణతో రూపుదిద్దుకుంటున్న ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జివల్ల  వల్ల మంగళగిరి, అమరావతి, తాడికొండ తదితర పరిసర ప్రాంతాల మధ్య రవాణా సులభతరం కానుంది. దీనితో పాటు మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా తొలి విడతలో దాదాపు 1,167 కోట్ల వ్యయంతో 531 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ,   వ్యర్థ నీటి శుద్ధి కేంద్రాల  పనులకు శ్రీకారం చుట్టారు.

అలాగే.. కేంద్ర ప్రభుత్వ 'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద  12.56 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంగళగిరి రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక హంగులు, ప్రయాణికుల సదుపాయాలతో  పునర్నిర్మించడం జరిగింది.  మరోవైపు.. పర్యావరణ పరిరక్షణ   ప్రజలలో  ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో కాజా తూర్పు చెరువు పార్కును శోభాయమానంగా అభివృద్ధి చేశారు. 17 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ పార్కులో 1.7 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆటస్థలాలు,  వేలాది మొక్కలతో కూడిన పచ్చదనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరిని కేవలం నివాస ప్రాంతంగానే కాక, ఆధునిక సదుపాయాలు కలిగిన పట్టణంగా నిలబెడుతున్నాయి. లోకేష్ నాయకత్వంలో మంగళగిరి వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో స్థానికులలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. మంగళగిరి నియోజకవర్గం సరికొత్త ప్రగతి శకానికి వేదికగా మారుతోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

Nara Lokesh, Mangalagiri Development, Chandrababu Naidu, Pawan Kalyan, AP Politics

By
en-us Political News

  
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.