ఎంపీ అవినాష్ కు కపడ చేజారిపోయిందా? ఆయనకు వైసీపీ టికెట్ దక్కే అవకాశం లేదా? ఒక వేకడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైసీపీ దూరం పెట్టేస్తుందా? అంటే వైసీపీ వర్గాలు ఔననే అంటున్నాయి. అలా పెట్టకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కడప లోక్ సభ నుంచి అవినాష్ కే పార్టీ టికెట్ ఇస్తే.. ఆయన గెలుపు అనుమానమేనని, అనుమానమేమిటి.. ఆయన ఓటమి తథ్యమని అంటున్నాయి. ఇందుకు వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయాన్ని కడప వాసులు గట్టిగా నమ్ముతుండటమే కారణమని చెబుతున్నాయి. అవినాష్ తల్లి అనారోగ్యం పేరుతో కర్నూలు ఆస్పత్రి వద్ద చేసిన హంగామా తరువాత జిల్లా వ్యాప్తంగా అవినాష్ రెడ్డి ప్రతిష్ట దిగజారిందనీ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కడప ఎంపీ టికెట్ విషయమే కారణమని జనం గట్టిగా నమ్ముతున్నారని చెబుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం ఏమిటంటే.. అవినాష్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఉన్న బంధుత్వం. బాబాయ్ వివేకానందరెడ్డితో జగన్ కు ఉన్న విభేదాలు. జగన్ తండ్రి వైఎస్ బతికి ఉన్న సమయంలోనే జగన్ కు కడప ఎంపీ టికెట్ కోసం పంచాయతీ జరిగింది. ఆ సందర్భంగా జగన్ వివేకాతో దురుసుగా ప్రవర్తించిన విషయం అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వరకూ వెళ్లింది. అదలా ఉంచితే.. వైఎస్ వివేకా మరణం తరువాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు. బంధుత్వం కారణంగా వివేకాను సొంత పార్టీలోకి చేర్చుకున్నప్పటికీ జగన్ ఆయనను దూరంగా ఉంచుతూనే వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పరోక్షంగా ఆయన ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలూ ఉన్నాయి. అప్పట్లో వివేకా ఎమ్మెల్సీగా పరాజయం కావడం వెనుక అవినాష్ కీలకంగా వ్యవహరించారని చెబుతారు. అవన్నీ పక్కన పెడితే..కడప ఎంపీ సీటు విషయంలో వివేకా గట్టిగా పట్టుబట్టారనీ, అయితే షర్మిల లేదా తాను పోటీ చేయాలి తప్ప అవినాష్ కు వైసీపీ టికెట్ ఇస్తే సహించేది లేదని కరాఖండీగా చెప్పడంతోనే ఆయన ఎలిమినేషన్ కు కుట్ర జరిగిందని చెబుతారు. జగన్ సోదరి షర్మిల అయితే బాబాయ్ వివేకానందరెడ్డి కడప ఎంపీ సీటు విషయంలో గట్టిగా నిలబడ్డారని బహిరంగంగానే చెప్పారు. ఇక సీబీఐ కూడా వివేకా హత్యకు రాజకీయకారణాలున్నాయని విస్పష్టంగా పేర్కొంది. కడప వాసులు కూడా వివేకా హత్య విషయంలో అవినాష్ ప్రమేయం ఉందనే విశ్వసిస్తున్నారు. అందుకే అవినాష్ 2024 ఎన్నికలలో అవినాష్ పోటీ చేస్తే ఓడించడం తధ్యం అని చెబుతున్నారు. వైఎస్ కుమారుడిగా జగన్ కు కపడపై ఎంత పట్టు ఉన్నప్పటికీ... వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కఃను కాపాడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను మాత్రం కడపవాసులు తప్పుపడుతున్నారు. దీంతో జగన్ కు అవినాష్ ను కడప నుంచి దూరం పెట్టడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే అవినాష్ ను కాకుండా మరెవరిని నిలబెట్టాలన్న విషయానికి వస్తే.. అక్కడా జగన్ కు తాను దూరం పెట్టిన తల్లిని మళ్లీ తీసుకువచ్చి నిలబెడితే తప్ప ఆ సీటును కాపాడుకోలేని పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే జగన్ వెళ్లి తల్లిని కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడమని అర్ధిస్థారా? అలా అర్ధించినా, గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి ‘సగౌరవంగా’ సాగనంపిన కొడుకు అభ్యర్థనను ఆమె ఔదాలుస్తారా అన్నవి ప్రశ్నలే? మొత్తం మీద అక్కడ నిలబడేది ఎవరన్నది పక్కన పెడితే ఆ సీటు అవినాష్ చేయి జారిందని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-chance-to-contest-in-kadapa-39-156596.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.