రేపటి నుంచి మరో మారు భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
Publish Date:Feb 5, 2024
Advertisement
‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి రేపటి నుంచి మరోమారు యాత్రను ప్రారంభించనున్నారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. వారిని ఓదార్చి ఆర్థికసాయం అందిస్తారు.
రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు గుంటూరు, నరసరావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు. రేపు (ఫిబ్రవరి 6న) మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తారు. 7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగుతుంది. 8న తాటికొండ, 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు. పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భువనేశ్వరి పర్యటనలో పలువురు కార్యకర్తలతోపాటు నాయకులు కూడా పాల్గొంటారు.
నిజం గెలవాలి యాత్రను భువనేశ్వరి నారావారిపల్లె నుంచి మొదలు పెట్టారు. అప్పట్లో ఆమె బస్సులో బయలుదేరారు ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో ప్రజలతో సహపంక్తి భోజనం చేసారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో ఆమె పాల్గొన్నారు.. ఆ తర్వాత తిరుపతి దామినేడులో చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతి చేందిన కార్యకర్త కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. తిరుపతి జిల్లాలో రెండు రోజులపాటు ఈ పర్యటన సాగింది.
మొదటిసారి నిజం గెలవాలి యాత్ర బయలు దేరినప్పుడు విఘ్నాలు లేకుండా జరిగేలా చూడాలని తిరుమల శ్రీవారిని మొక్కుకున్నారు నారా భువనేశ్వరి. యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం ఇచ్చారు. పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల యాత్ర అనంతరం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు భువనేశ్వరి బయలు దేరి అక్కడ కులదేవతకు పూజలు చేసారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులను సందర్శించారు.
http://www.teluguone.com/news/content/nizam-gelavaali-yatra-ones-again-tomorrow-on-wards-39-169921.html





