స్పీడ్ న్యూస్ 1

Publish Date:Jul 13, 2023

Advertisement

1.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.  శుక్రవారం మధ్యాహ్నం రెండుగంటల 35 నిమిషాలకు  రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. 

2. భారత రిటైల్ ద్రవ్యోల్భణం జూన్ నెలలో భారీగా పెరిగింది. అంతకుముందు నెలలో 4.31గా ఉన్న రిటైల్ ద్రవ్యోల్భణం జూన్ నెలలో 4.81కి చేరుకుంది. 

3.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర  ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. చోడవరం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. 

4.తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద భక్తులకు చిరుత కనిపించింది. దీంతో టీటీడీ అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఒక బాలుడిపై చిరుత దాడి తెలిసిన విషయమే.

5.సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బుధవారం మరో ఇద్దరు అరెస్టయ్యారు. కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్, అతని కూతురు సాహితీలను ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 

6. ముఖ్యమంత్రి జగన్ కొంతకాలంగా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరో చెప్పాలని జగన్ ను పవన్ నిలదీశారు. తాడేపల్లిగూడెం లో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని మాట్లాడారు.

7. జగన్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాలలో నాశనం అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.  ఉండవల్లిలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో బాబు మాట్లాడారు. రాష్ట్రానికి ఇప్పుడు సంపద సృష్టించే ప్రభుత్వం కావాలని మీడియా చిట్ చాట్ లో చంద్రబాబు చెప్పారు.

8.వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.   ఈ నేపథ్యంలో ఆయనపై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. 

9.రాజోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు  కన్నుమూశారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోగల తన అపార్ట్‌మెంట్‌లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కృష్ణంరాజు మృతి చెందారు. 

10.వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

11. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీ సమీపానికి వరదనీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో  ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మూసివేస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. 

12.మరో రెండేళ్లలో ఇంటర్నెట్ అంతమైపోతుందంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’లో వచ్చిన కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంటర్నెట్‌లోనూ ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. 

13.  వ్యవసాయానికి మూడు గంటల ఉచిత విద్యుత్ చాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రిమల్లారెడ్డి మాట్లాడుతూ రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అని, తనను కూడా బ్లాక్ మెయిల్ చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

14.రాజస్థాన్‌లో దారుణం జరిగింది. హత్యకేసు నిందితులను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తుండగా అడ్డుకున్న ఓ ముఠా పోలీసుల కళ్లలో కారం చల్లి నిందితులపై కాల్పులు జరిపింది. 

15.వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలానికి విండీస్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. కేవలం 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్ అయింది. 

16.భార్యకు తెలియకుండా వంటలో రెండు టమాటాలు వాడిన ఓ వ్యక్తి కాపురం కూలిపోయింది. భర్తపై మండిపడ్డ ఆ ఇల్లాలు తన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో వెలుగు చూసింది. 

17.స్కూల్‌లోనే విద్యార్థులు మందుకొట్టారు. ఆపై టీచర్‌ను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన ఉదంతం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.

18. హర్యానాలో అసాధారణ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది. 

19.అదుపుతప్పిన స్మార్ట్‌ఫోన్ వినియోగం బాల్యాన్ని చిదిమేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌కు బానిసైపోయిన ఓ పదేళ్ల బాలుడు చివరకు మతిస్థిమితం కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో తాజాగా వెలుగు చూసింది. 

20. కోల్‌కతా లోకల్ రైలులో కొందరు మహిళలు జుట్టు పట్టుకొని ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియోను ఆయుషి అనే మహిళ కోల్‌కతా లోకల్ పేరుతో  ట్విట్టర్ లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.