కొత్త సంవత్సరం.. అమరావతికి నవశకం

Publish Date:Dec 20, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి  కొత్త సంవత్సరంలో నవశకం ఆరంభం కానుంది. జగన్ ఐదేళ్ల హయాంలో అన్ని విధాలుగా భ్రష్ఠుపట్టించిన రాజధాని నిర్మాణ పనులు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజథాని ఉండాలన్న ఉద్దేశంతో చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన తరువాత చేసిన ప్రయత్నాలు ఫలించే దశలో రాష్ట్రంలో 2019లో ప్రభుత్వం మారింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరతీసి అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా కష్టాలూ పెట్టారు. ఇటు అమరావతిని పాడుపెట్టారు. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది. అయితే 2024ఎన్నికలలో రాష్ట్రప్రజలు జగన్ ను తిరస్కరించి మళ్లీ చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారు.  దీంతో అమరావతికి జవసత్వాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతేనని నిర్ద్వంద్వంగా చాటిన చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులను పరుగులెత్తిస్తున్నారు.   

జనవరి నుంచి నిర్మాణ పనులు షురూ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్  కలల రాజదాని అమరావతి కొత్త ఏడాదిలో సరి కొత్త రూపం సంతరించు కోనున్నది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాజధాని నిర్మాణ పనులు అటకెక్కాయి. ఆ ప్రాంతం అంతా కీకారణ్యంగా మారింది. రెండు మాసాల క్రితం ఈ  ప్రాంతాన్ని  నిర్మాణాలకు అనువుగా మార్చేందుకు గాను జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. అంతే కాక సీడ్ యాక్స్చేస్ రోడ్డు   దేదీప్యమానంగా వెలుగులీనడం మొదలైంది.  అంతే కాక ఇటీవల సిఎం  చంద్రబాబు నాయుడు మంత్రి పొంగూరు నారాయణతో కలసి పలు మార్లు నిర్వహించిన సీ ఆర్ డి ఎ సమీక్షల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వేలాది కోట్ల రూపాయల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

  మూడు రాజధానులంటూ డ్రామాలాడిన వైసీపీ   ఎన్నికలకు ముందు విశాఖలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ప్రారంభించి లబ్ధి పొందాలని చూసింది. అదే సమయంలో విపక్షంలో ఉన్న కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తాము అమరావతి రాజధానికే మద్దతిస్తున్నట్లు ప్రకటించేశాయి.  అదే సమయంలో ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చే తీర్పు రాజధానికి కీలకంగా మారింది. మరోవైపు అమరావతి రాజధానికి ప్రజల మద్దతు సంపాదించేందుకు కూటమి పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి.  

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అనూహ్య స్ధాయిలో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో వైసీపీ మూడు ముక్కలాటకు చెక్ పడింది. అమరావతికి తిరిగి ప్రాణం వచ్చింది. గత ఐదేళ్లుగా వైసీపీ ఆడిన మూడు రాజధానుల  ఆటతో అమరావతి నష్టపోయింది. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వాన్నినమ్మి ఏకంగా 36 వేల ఎకరాల భూమిని స్వచ్చందంగా ఇచ్చిన రైతులు ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి వారికి సకాలంలో ఇస్తామన్న కౌలు రావడం అందలేదు. ప్రతీ ఏటా హైకోర్టుకు వెళ్లి మరీ రైతులు కౌలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.  అసెంబ్లీ ఎన్నికలలో  ప్రజలు ఇచ్చిన తీర్పుతో  రాజధాని అమరావతే అన్న స్పష్టత వచ్చేసింది. ఐదేళ్ల పాటు ఏపీ రాజధాని అంటే ఏదనే ప్రశ్నకు ఇక తావు లేకుండా పోయింది. ఇక కోర్టుల్లో గతంలో రైతులు దాఖలు చేసిన కేసులు వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభం కానుంది.

 కూటమి సర్కార్ కూడా అమరావతిలో వేగంగా అడుగులేస్తోంది. వచ్చే జనవరి నుంచి అమరావతిలో పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. అలాకూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే  రాజధానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మూడేళ్ల కాల వ్యవధి పెట్టుకుని తెలుగుదేశం కూటమి సర్కార్ అమరావతి పూర్తి లక్ష్యంగా ముందుకు కదులుతోంది.  

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.