Publish Date:Apr 13, 2025
వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కర్పొరేటర్లు ఒక్కరొక్కరుగా జారిపోతున్నారు. తాజాగా వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశి జనసేన గూటికి చేరారు.
Publish Date:Apr 13, 2025
తిరుమలలో శనివారం (ఏప్రిల్ 12) జరిగిన అపచారానికి సంబంధించి బాధ్యులపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. అసలేం జరిగిందంటే. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు తిరుమల ఆలయం మహాద్వారం వరకూ పాదరక్షలతో వచ్చారు. మహాద్వారం వరకూ భక్తులు రావడానికి ముందు మూడు ప్రాంతాలలో ఉన్న తనిఖీలను వారు దాటుకుని వచ్చారు.
Publish Date:Apr 13, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ మరోసారి రెచ్చిపోయింది.
Publish Date:Apr 13, 2025
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుక విజయవాడలో శనివారం ఘనంగా జరిగింది. ఈ కర్యక్రమానికి తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచీ తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Publish Date:Apr 12, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఎండీసీఏ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
Publish Date:Apr 12, 2025
సింప్లిసిటీకి నిదర్శనంగా నిలుస్తున్నారు ఢిల్లీ సీఎం రేఖాగుప్తా. తాను చేయాలనుకున్నది, చెప్పాలనుకున్నది ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం (ఏప్రిల్ 14) ఆమె వెళ్తున్న మార్గంలో ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై ఆవుకు ఆహారం విసిరేయడాన్ని చూశారు.
Publish Date:Apr 12, 2025
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. ఆ వర్షంలో క్రికెట్ అభిమానులు తడిసి ముద్దైపోయారు. క్రికెట్ మజా ఏమిటో ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో శనివారం రాత్రి హైదరాబాద్ సన్ రైజర్, పంజాబ్ కింగ్స జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే అర్ధమౌతుంది.
Publish Date:Apr 12, 2025
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దంపతులు తమ కుమారుడు మార్క్ శంకర్ ను తీసుకుని సింగపూర్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.
Publish Date:Apr 12, 2025
రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్‌లైన్ విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Publish Date:Apr 12, 2025
నీతి నిజాయితీలకు మారు పేరు, డిపార్ట్‌మెంట్‌లో అంకుశం అనిపించుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆదివారం (ఏప్రిల్ 13) అమలాపురం వేదికగా ఆయన తన రాజకీయరంగ ప్రవేశంపై ప్రకటన చేయబోతున్నారన్న విషయం ఇటు రాజకీయవర్గాల్లో, అటు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Publish Date:Apr 12, 2025
వరంగల్ వేదికగా శుక్రవారం జరిగిన జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. దాదాపు 23 వేల 238 ఈ జాబ్ మేళాకు హాజరు కాగా వీరిలో దగ్గరదగ్గర 5631 మందికి ఉద్యోగాలు లభించాయి.
Publish Date:Apr 12, 2025
దేశ వ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దాదాపు గంట సేపు ఈ సేవలన్నీ నిలిచిపోయాయి.
Publish Date:Apr 12, 2025
అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తేవాడొకడు అని సామెత. ఈ సామెత ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో ఏమో కానీ.. అప్పులు తెచ్చుకొనేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఓ బ్రోకరేజ్ సంస్థను పెట్టుకున్నదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన తాజా ఆరోపణ. ఆ ఆరోపణ నిజం అయితే మాత్రం ఆ సామెత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని అంటున్నారు.